news

హైపర్ ఆది ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!!

తెలుగు కామెడీ ప్రోగ్రామ్స్ లో స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఈటీవీ జ‌బ‌ర్ద‌స్థ్ షో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. చాలామంది విమర్శలు చేస్తూనే గురు, శుక్రవారాలు ఈ షో చూస్తూ ఆనందిస్తారన్న అపవాదు జబర్దస్త్ సమర్థకుల నుంచి ఉండనే ఉంది. ఇటీవల ఓ సినిమాలో అయితే ‘వారంలో ఐదు రోజులు బతికేదే రేష్మి, అనసూర్యలను చూడ్డానికి..’అని పలికిస్తాడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుతో కథా రచయిత. తెలుగువారి ఇళ్లలోకి అంతలా దూసుకుపోయింది ఈ కార్యక్రమం. అందుకే సౌత్ ఇండియాలోనే నంబర్.1 రేటింగ్ కార్యక్రమంగా రికార్డులు సృష్టించింది. అంతేకాదు క్రియేటివ్, రియాల్టీ షోలు, బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న జీ, మా, జెమినిలకు పోటీ ఇవ్వలేక చతికిల బడిన ఈటీవీ ఈ ఒక్క షో కారణంగా ఫస్ట్ పొజిషన్ కు చేరుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తీసే ఏకైక తెలుగు ఛానల్ గా వెలుగొందుతోంది. అసలు జబర్దస్త్ కమెడియన్లతోనే ‘ఈటీవీ ప్లస్’ అనే ఓ సక్సెస్ ఫుల్ టీవీ ఛానల్ సైతం రన్ చేస్తోంది ఈనాడు గ్రూపు. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో లీడ్ రోల్ హైపర్ ఆది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ముతక డైలాగులుండవు. తన టైమింగ్ పంచుల్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలను సైతం అతడి స్కిట్ లో మాత్రమే హాస్యభరితంగా చెప్పడం అతగాడి ప్రత్యేకత. ఇక కొందరివాడిగా, తనకు నచ్చని వారిపై అమర్యాదకర పంచులేసి వెగటు పుట్టిస్తాడని కూడా రీసెంట్ గా కత్తి మహేష్ వ్యవహారంలో అభాసుపాలయ్యాడు కూడా.. ఆ సంగతి పక్కన పెడితే యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో హైపర్ ఆది స్కిట్లు మాత్రమే ఉంటున్నాయి. ఎంటైర్ జబర్దస్త్ లో మిగిలిన అందరి స్కిట్లకంటే హైయెస్ట్ వ్యూస్ హైపర్ ఆదికి మాత్రమే వస్తుంటాయంటే అతగాడికి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందుకే రెమ్యునరేషన్ విషయంలో కూడా జబర్దస్త్ నిర్వాహకులైన మల్లెమాల సంస్థవారు… హైపర్ ఆది వరకు ఎంత అడిగినా ఇవ్వక తప్పని పరిస్థితి అని టాక్. మిగిలిన టీం లీడర్లను నెలకు రూ.2-3లక్షలకే సరిపెట్టినా సరే, ఆది విషయానికి వస్తే అది ఇంకో లక్ష నుంచి లక్షన్నర వరకు ఎక్కువే ఉంటోందట. అయినా సరే క్రేజ్, రేటింగ్ నిలుపుకోవడానికి తప్పని పరిస్థితి నిర్వాహకులది. ఇటీవలి కాలంలో జబర్దస్త్ క్రేజ్ కొద్దిగా పడిపోయినా దానిని నిలబెట్టిన ఘనత ఆదిది. అయితే తన యారగెంట్ బిహేవియర్ తో కత్తి మహేష్, సామాజిక ఉద్యమకారిణి దేవి, టీవీ 9 ఛానల్ లు… జబర్దస్త్ ను పర్సనల్ గా టార్గెట్ చేసే పరిస్థితి తీసుకురావడం కూడా నిర్వాహకులకు కాసింత ఇబ్బందిగా మారింది ఇటీవలి కాలంలో… అయినా సరే ఆది ఈజ్ జబర్దస్త్.. జబర్దస్ ఈజ్ ఆది అని మారిపోయిందనేది మాత్రం కాదనలేని సత్యం.

ఇక ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది వర్థమాన కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. వారికి సినిమాల్లో కూడా మంచి ఛాన్సులు వస్తుండడంతో భాగా సెటిల్ అయిపోయారు. ఆది విషయానికి వస్తే ప్రతి ప‌దానికి ఓ పంచ్ విసురుతూ క‌డుపుబ్బా న‌వ్విస్తుంటాడు. అదిరే అభి టీమ్‌లో మొద‌టిలో చిన్న చిన్న పాత్రల‌ను చేసిన ఆది త‌రువాత టీం లీడర్ గా ఎదిగాడు. ఆది క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నప్పడు కంటే ఇప్పుడు ఏడు ఎనిమిది రెట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.. దీంతో కోట్లలోకి ఆస్తులు చేరాయని, మంచి ఇల్లు కూడా కొనుక్కున్నారని చెబుతున్నారు. అయినా సరే కష్టపడి సంపాదించుకుంటున్నప్పుడు ఎవరూ అనడానికి లేదు.

ఇక జబర్దస్త్ లో వచ్చిన రెప్యుటేషన్ తో పాటు చాలా అవకాశాలు వస్తున్నాయట ఆదికి. ఒక్కోసారి ఈ రైజింగ్ కమెడియన్ కాల్ షీట్లు దొరకడం కూడా కష్టమైపోయిందట. బయట ఏదైనా షో కు వెళ్ళి స్కిట్ చేసినా లక్షన్నర తీసుకుంటున్నాడట ఆది. ఇక గెటప్ శ్రీను తో కలసి చేస్తున్న సినిమా చూపిస్త మామ షోతో మరో రెండు లక్షల వరకు రెమ్యునరేషన్ ప్రతి నెలా అందుకుంటున్నట్లు సమాచారం. ఏది ఎలా ఉన్నా చాలా తక్కువ టైంలో హైపర్ ఆది బాగా క్రేజ్ తెచ్చుకొని.. అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వచ్చిన రెమ్యునరేషన్ ను ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసిన మూలాన ఐదు నుంచి పది కోట్ల వరకు ఆది ఆస్తులు చేరాయని సినీ, టీవీ సర్కిళ్లలో టాక్. వ్యక్తుల టార్గెట్ గా పంచ్ లను, టీవీ ఛానల్స్ లో దుందుడుకు వాదనలను మానుకుంటే ఆదికి చాలా బెస్ట్ కెరీర్ ఉంటుందని అతని శ్రేయోభిలాషుల మాట.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment