Business

ఐడియా కస్టమర్లకు ఉహించని బంపర్ ఆఫర్!

ఐడియా తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్యాక్‌ను ప్రకటించింది. 84 రోజుల కాలపరిమితితో రోజు 1జీబీ 3జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ (నేషనల్ రోమింగ్ ఉచితం), రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు ఆఫర్ చేస్తున్న ఈ ప్యాక్ ఖరీదు రూ.509కే ఇవ్వబోతోంది. ఈ ఆఫర్ ద్వారా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు గట్టిపోటీ ఇవ్వనుంది. జియో రూ.459 ప్యాక్‌లో ఖాతాదారులకు రోజుకు 1జీబీ 4జీ డేటా, ఉచిత కాల్స్, 84 రోజుల కాలపరితితో పాటు జియో యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించే వీలుంది. అలాగే జియోలో రూ.509తో మరో ప్యాక్ కూడా ఉంది. ఇందులో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. కాలపరిమితి 49 రోజులు. ఎయిర్ టెల్ కూడా..

ఎయిర్‌టెల్ ఇటీవల రూ.509 ప్యాక్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌లో వినియోగదారులు రోజుకు 1జీబీ 4జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఉచిత ఎస్మెమ్మెస్‌లు పొందవచ్చు. కాల పరిమితి 84 రోజులు. వొడాఫోన్ కూడా ఇంచుమించు ఇవే ఆఫర్లతో రూ.509 రీచార్జ్ ప్యాక్‌ను ప్రకటించింది. కాగా, జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు 4జీ డేటా ఆఫర్ చేస్తుండగా ఐడియా 3జీ డేటాను అందిస్తుండడం గమనార్హం. ఐడియా ఇటీవల తన రూ.198 ప్రీపెయిడ్ ప్యాక్‌ను అప్‌గ్రేడ్ చేసింది. గతంలో ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ డేటా ఇవ్వగా, దీనిని సవరించి 1.5జీబీని అందిస్తోంది. మై ఐడియా యాప్ యూజర్లు అదనంగా 1జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. అంటే మొత్తంగా 2.5 జీబీని పొందవచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ.349, రూ.549 ప్లాన్లలో రోజు వారీ లభించే డేటా లిమిట్‌ను 500 ఎంబీ మేర పెంచింది. ఇతర ఉచితాలతో పాటు రోజుకు అదనంగా 500 ఎంబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అప్‌డేట్‌ చేసిన రూ.349 ప్లాన్ ద్వారా ఇప్పుడు రోజుకు 1.5 జీబీ కాకుండా 2జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.549 ప్లాన్‌లో ఇప్పటి వరకు రోజూ 2.5 జీబీ డేటా లభించగా ఇకపై రోజూ 3జీబీ డేటా లభ్యం కానుంది. సెప్టెంబర్‌లో రూ.349 ప్లాన్‌ లాంచ్‌ రూ.349 ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసింది. తొలుత ఈ ప్లాన్‌ను లాంచ్‌ చేసినప్పుడు, అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజుకు 1జీబీ డేటా అందించింది. తర్వాత నవంబర్‌లో డేటా పరిమితిని 1.5జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ పరిమితిని 2జీబీకి పెంచేసింది. దీంతో మొత్తంగా కస్లమర్లు 56జీబీ డేటా పొందనున్నారు.

Comments

comments

Recent Posts