politics

జగన్ ఎప్పటికి సీఎం కాలేడు…

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని మంత్రి నారాయణ అన్నారు. జగన్ ఎపుడు ఏం మాట్లాడతాడో అతనికే తెలియదన్నారు. తుని సంఘటనలో జగన్ అనుచరుల హస్తం ఉండటం వల్లే కేసులు మాఫీ చేస్తామంటున్నాడని ఎద్దేవా చేశారు. రైల్వే కేసులు మాఫీ చేయాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి కదా అని ప్రశ్నించారు. జగన్ చంద్రబాబుపై బురదజల్లే కార్యక్రమం తప్ప ఏమీ చేయడం లేదని వ్యాఖ్యానించారు.

పి.డి అకౌంట్స్‌ పై మాట్లాడటం ఫూలిష్ థింగ్, పి.డి అకౌంట్స్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాలేదని చెప్పారు. గత ప్రభుత్వాలనుంచీ వున్నాయని, ఎక్కడైనా నిధులు దుర్వినియోగం అయి వుంటే రుజువులు చూపించాలని మంత్రి నారాయణ సవాల్ విసిరారు.

Comments

comments