Business

జియో వినియోగదారులకి మరో శుభవార్త..!

రిలయన్స్ జియో సిమ్ వాడుతున్నవారికి మరో కొత్త అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది.. సాధారణంగా అందరూ మై జియో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటారు.. తాజాగా మై జియోకి వచ్చిన అప్‌డేట్‌లో హల్లో జియో అనే వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కల్పించారు.. ఈ వాయిస్ అసిస్టెంట్.. ఇప్పుడు అండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లను వాడుతూ రిలయన్స్ జియో సిమ్‌ని కలిగి ఉన్న వారికీ ప్రవేశ పెట్టబడింది.

ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లీషు భాషలను ఇది సపోర్ట్ చేస్తోంది. మీ ఫోన్‌లో మై జియో యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత జియో యాప్స్ పక్కనే కొత్తగా ఓ మైక్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు, హల్లో జియో వాయిస్ అసిస్టెంట్‌లోకి వెళ్లిపోవచ్చు.. అయితే ఈ హల్లో జియో కేవలం మై జియో యాప్‌లోని వివిధ సదుపాయాలను వినియోగించుకోవడానికి మాత్రమే ఉపకరిస్తుంది.

అంటే ఆ యాప్‌లో మొబైల్ రీచార్జ్ చేయమనీ, అకౌంట్ బ్యాలెన్స్ చూపించమనీ, ఇతరత్రా పనులను మాత్రమే హల్లో జియో సాయంతో ఆదేశించవచ్చు.. ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రస్తుతానికి చాలా ప్రారంభ దశలో ఉంది, దీన్ని మరింత మెరుగుపరచవలసిన అవసరం ఉంది..

Comments

comments

Recent Posts