movies

ప్రభుదేవానే పెళ్లి చేసుకుంటా

పవన్ కళ్యాణ్ కొమరం పులితో టాలీవుడ్ కు పరిచయమైన హీరొయిన్ నికిశా పటేల్ పాపం ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోలేక పోయింది. పవర్ స్టార్ సినిమా అయినప్పటికీ డిజాస్టర్ కావడంతో అందం చందం అన్ని ఉన్నా ఎవరు పిలిచి ఛాన్స్ ఇవ్వలేదు. ఇలా వర్క్ అవుట్ కాదని కన్నడ, తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది వాటి ఫలితాలు కూడా అంతంత మాత్రమే.

ఆ మధ్య అరకు రోడ్లో, ఓం 3డి అని తెలుగులో రెండు చేస్తే అవి విడుదల అయిన విషయం కూడా ఎవరికి తెలియకుండా పోయింది. ప్రస్తుతం కోలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిన నికిశా పటేల్ తమిళ మీడియాకు బాగానే అందుబాటులో ఉంటోంది. తన పర్సనల్ విషయాలు మొహమాటం లేకుండా చెప్పుకునే నికిశా అందులో భాగంగానే తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పేసింది.

మూడు బాషలలో వివిధ హీరోలతో చేసినా తనకు ప్రభుదేవానే పిచ్చి ఇష్టమని అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అని చెప్పి షాక్ ఇచ్చింది. అదేంటి పెళ్లై విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఉన్న అతన్ని పెళ్లి చేసుకుంటావా అంటే ఔననే అంటోంది. పైగా తమ ఇద్దరి ఫ్యామిలీస్ కి మంచి వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయట.

కాని మరి సీరియస్ గా అందో లేక తమాషాకు ప్రభుదేవాతో ఉన్న చనువు కొద్ది అందో కాని మొత్తానికి ఇది వైరల్ అయిపోయింది. ఏమైనా ప్రభుదేవా ఘటికుడు. 40 దాటిన వయసులో కూడా నయనతార, నికిశా పటేల్ లాంటి హాట్ హీరొయిన్స్ తన వెంట పడేలా చేసుకుంటున్నాడు. ఒకవేళ నికిశా నిజంగానే అని ఉంటే మాత్రం ప్రభుదేవాను పెళ్లి కొడుకుగా త్వరలోనే చూసుకోవచ్చు.

Comments

comments