movies

పాత సీసాలో కొత్త కళ్యాణ్ – ట్రైలర్ రివ్యూ

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మొదటి సారి తమన్నాతో జంట కట్టిన నా నువ్వే ట్రైలర్ విడుదల అయ్యింది. సాఫ్ట్ గా లవర్ బాయ్ గా కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత ఒక ప్రేమ కథలో నటిస్తున్నాడు. కథ చాలా సింపుల్ గానే అనిపిస్తోంది. హీరో వెనుక అతనికి తెలియకుండా వెంట పడుతున్న హీరొయిన్, ఇద్దరి మధ్య కాసేపు దోబూచులాట, చిన్న చిన్న కమ్యునికేషన్ గ్యాప్ లు, హీరో దేశం వదిలి వెళ్ళాలి అనుకోవడం, రేడియో జాకీ అయిన హీరొయిన్ తన ప్రేమను అందరికి వినిపించేలా చాటి చెప్పడం ఇలా ఇలా సాగిపోయింది.

కథ ఏమంత గొప్పగా అనిపించకపోయినా దర్శకుడు జయేంద్ర టేకింగ్ మాత్రం పిసి శ్రీరామ్ కెమెరాలో అద్భుతంగా కనిపిస్తోంది. మరీ థ్రిల్ కలిగించే లైన్ కానప్పటికీ యూత్ ని ఆకట్టుకునే అంశాలు మాత్రం చాలానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి.

ఇందులో ప్రధాన ఆకర్షణ నో డౌట్. తమన్నానే. తన లుక్స్ తో యాక్టింగ్ తో ట్రైలర్ లో ఉన్న కొద్ది సీన్స్ లో కళ్యాణ్ రామ్ ని పూర్తిగా సైడ్ చేసేసింది. కళ్యాణ్ రామ్ మరీ యూత్ హీరో కాకపోవడంతో కొంచెం ఆ ఛాయలు కనిపించడం ఇబ్బందిగా అనిపించినా కథలో లీనమైతే అదేమంత లోటుగా అనిపించకపోవచ్చు. తమన్నా మాత్రం అన్ని రకాల ఎక్స్ ప్రెషన్స్ తో చాలా కాలం తర్వాత నటనకు స్కోప్ ఉన్న పాత్రను దక్కించుకున్నట్టు కనిపిస్తోంది. శరీత్ సంగీతం చక్కగా అమరింది.

కళ్యాణ్ రామ్-తమన్నా కాకుండా వెన్నెల కిషోర్ ఒక్కడే ఇతర లీడ్ యాక్టర్స్ లో కనిపించాడు. జ్యోతిష్యానికే జ్వరం తెప్పించేలా ఉన్నావే అంటూ చెప్పిన డైలాగ్ పేలింది. గతంలో 180 లాంటి డీసెంట్ లవ్ స్టొరీ తో ఆకట్టుకున్న దర్శకుడు జయేంద్ర ఈ సారి కూడా మరో సున్నితమైన ప్రేమ కథనే ఎంచుకున్నాడు. కాకపోతే మాస్ సినిమాలలో రఫ్ గా  చూస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ కెరీర్ లో కాస్త లేట్ గా చేస్తున్న ఇంత యూత్ ఫుల్ క్యారెక్టర్ లో ఎంత వరకు మెప్పిస్తాడో విడుదల అయ్యాకే చెప్పగలం.

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment