news

ఆ ఎమ్మెల్యే నా మీద కేసు పెట్టాడు : కత్తి మహేష్

కత్తి మహేష్ రోజురోజుకు తన కామెంట్స్ తో వార్తలలో నిలుస్తున్నాడు.. రాంగోపాల్ వర్మ అప్పుడప్పుడు వార్తలలో నిలుస్తారు కానీ కత్తి మాత్రం పార్థి రోజు వార్తలలో ఉంటున్నాడు.. దీనికి కారణం అయన చేసే ఫేస్ బుక్ పోస్ట్ లు మాత్రమే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విపరీతంగా కామెంట్స్ చేస్తూ ఉన్నాడు.. నిన్నటి వరకు అయన పేరు సౌత్ వరకు ఉంటె ఈ రోజు నార్త్ కూడా పాకింది.. కత్తి మహేష్ ఒక్క పవన్ కళ్యాణ్ ను మాత్రమే కాకుండా అప్పట్లో పప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి మీద అనేక కామెంట్లు చేశారు..

చిరంజీవి మోసం చేసి వెళ్లిపోయారని, ఇప్పుడు పవన్ కూడా అదే చేస్తున్నారని అన్నారు.. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని కూడా నరహంతకుడు అని కామెంట్ చేశాడు.. మతం పేరుతో మోడీ దేశంలో నరహంతుకుడుగా మారాడని అన్నారు.. దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.. త్వరగా పాపులర్ అవ్వాలనే ఆశతో, వార్తల్లో నిలవాలనే ఉద్దేశ్యంతో, చౌకబారు పబ్లిసిటీ కోసం ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేయడం తగదని రాజా సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో మహేష్ ను విమర్శించారు. మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కు తెలిపానని ఆ ట్వీట్ లో తెలిపారు.

 

ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందిస్తూ, “తగు చర్యల నిమిత్తం సంబంధింత అధికారికి మేము షేర్ చేస్తాం. థ్యాంక్యూ” అని తెలిపారు.. దీనిపై కత్తి మహేష్ మరోసారి పేస్ బుక్ పోస్ట్ పెట్టారు.. చట్టం తెలియని ఒక MLA నా మీద ఆన్ లైన్లో పోలీసులకి కంప్లయింట్ చేసినంత మాత్రాన ఏమీ కాదు. ఎవరు ఖంగారు పడకండి. ఆ కంప్లయింటూ చెల్లదు. అది కేసు అసలే కాదు.. అని పోస్ట్ చేశారు.. నాకు చటం గురించి బాగా తెలుసు.. కనుక మీరు ఎవ్వరు బాధపడకండి అని చెప్పుకొచ్చారు..

Comments

comments