news

కత్తి మహేష్ లవ్ స్టోరీ !!

గత కొద్ది నెలలుగా సీరియల్ లాగా సాగిన కత్తి మహేష్ వివాదం ఎట్టకేలకు ముగిసింది. సినీ రచయిత కోన వెంకట్ చెప్పినట్లుగానే వివాదం సద్దుమణిగింది. ఇకపై పవన్ అభిమానులు దూషించరని కోన వెంకట్ అన్నారు. అలాగే గుడ్లదాడికి పాల్పడిన వారిపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్న మహేశ్ కత్తికి సినీ రచయిత కోన వెంకట్ ధన్యవాదాలు తెలిపాడు.ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పవన్ అభిమానులు-మహేశ్ కత్తికి మధ్య సయోధ్య కుదిరింది. దీంతో స్టూడియో నుంచి నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పవన్‌ అభిమానులపై పెట్టిన కేసును కత్తి ఉపసంహరించుకున్నారు. అనంతరం పవన్ అభిమానులు, మహేశ్ కత్తి కలిసి ఫిలింనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో పార్టీ కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్‌లో మహేశ్ కత్తి కూడా వివాదం ముగిసిందని తెలిపారు.

పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు,ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను అని కత్తి మహేష్ ట్వీట్ చేశారు. ఇక జబర్దస్త్ కమెడియన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ ట్విట్టర్ సందేశం ఇచ్చాడు.

అభిమానులను పవన్‌ను హీరోగా చూడొద్దని మన నాయకుడు అని మాత్రమే అనుకోండని సూచన చేశారు. గతంలో మహేష్‌కు, ఆదికి మధ్య కూడా వివాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేష్ విషయంలో ఇన్వాల్వ్ కావొద్దని పరోక్షంగా పవన్ అభిమానులకు హైపర్ ఆది తెలిపాడు. ‘మీ అడుగులు ఇక మంచి కోసం వేయండి. రాజకీయంలో 100మంది 100 రకాలుగా మాట్లాడుతారు అందరినీ చూడాలి.. నవ్వుకోవాలి.. వదిలేయాలి. ఆయన ఇప్పుడు ప్రజల మనిషి మన హీరో అనుకోవడం మానేయండి మన నాయకుడు అని మాత్రమే అనుకోండి.’ అంటూ ఆది ట్వీట్ చేశాడు.

పవన్ కళ్యాణ్ అభిమానులతో కత్తి మహేష్ వివాదానికి నేటితో తెరపడింది. ఇంతగా పోరాడిన కత్తి మహేష్ వ్యక్తిగత జీవితంలో కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. ఆయనది ప్రేమ వివాహమట. అది కూడా సోషల్ మీడియా ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్న కత్తి మహేష్.. పెళ్ళిదాకా తీసుకొని వెళ్ళాడు. కోల్‌కతా యువతి సొనాలిని ఛాటింగ్ ద్వారా పరిచయం చేసుకుని ప్రేమ వివాహం చేసుకున్నాడని ఓ పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ఆమె లక్నోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం ఆ బాబుకి ఎనిమిదేళ్లు.

ఆ పిల్లాడు తల్లి వద్దే ఉంటూ చదువుకుంటున్నాడు. ఇక కత్తి మహేష్ సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని ఎల్లమంద కాగా, ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కత్తి మహేశ్ తండ్రి కత్తి ఓబులేశు ప్రస్తుతం సొంత ఊరైన ఎల్లమందలోనే నివసిస్తుండగా, కత్తి మహేశ్ తల్లి సరోజమ్మ ఏడాదిన్నర క్రితం క్యాన్సర్‌తో బాధపడుతూ మృతి చెందారు. ఇక కత్తి మహేశ్‌కి కత్తి రవికుమార్ అనే సోదరుడు ఉన్నారు. ఆయన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కత్తి మహేశ్ సోదరి వాణిశ్రీ సికింద్రాబాద్‌లో న్యూట్రిషనిస్ట్‌. ఇదండీ కత్తి మహేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.

Comments

comments