politics

లలితా జ్యూయలర్స్ ఎండీ కిరణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీకి .. ఎక్కడి నుంచి పోటీయో తెలుసా?!!

సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. గుజరాత్ ఎన్నికల్లో మోఢీ హవా కనుక కొనసాగితే ఆరు నెలల ముందుగానే ఎన్నికలొచ్చినా ఆశ్చర్యం లేదని ఇప్పటికే ఊహాగానాలు నడుస్తున్నాయి. అంటే వచ్చే ఏడాది ఇదే రోజుల్లో ఎన్నికలు జరిగే ఛాన్సెస్ లేకపోలేదు. అందుకే అన్ని పార్టీ లూ వారి బలాబలాలను అంచనా వేసుకుంటూ జనంలోకి దూసుకుపోతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న ఏపీ పొలిటిక‌ల్ స్క్రీన్ పై రాజ‌కీయ ప‌రిణామాలు మరింత హాట్ హాట్ గా ఉన్నాయి. అంతేకాదు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత ఖరీదయిన ఎన్నికలుగా ఈ జనరల్ ఎలక్షన్స్ నిలవబోతున్నాయి. అందుకే అన్ని పార్టీలూ బిగ్ షాట్స్ కు గాలం వేసే పనిలో పడినాయి. బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబు పదుల వేల కోట్లతో పొలిటికల్ స్కెచ్ వేస్తాడే.. దాదాపు అదే మాదిరి ఈ ఎన్నికలు జరుగుతాయి. టగ్ ఆఫ్ వార్ నడిచే సెంటర్లలో ఒక్కో ఓటు విలువ ఐదు ఆరు వేలకు చేరుకునే అవకాశాలున్నాయని అంచనాలు కూడా మొదలయ్యాయి. అందుకే బిజినెస్ టైకూన్లు, బడా పారిశ్రామికవేత్తలు, వేలకోట్ల అధిపతులకు గాలం వేసే పనిలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఫేస్ చేసేందుకు రెడీగా ఉండేందుకు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌గా, అధికార తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నిక‌ల‌కు అన్ని విధాలా వ్యూహాలను పన్నుతోంది.. చూస్తుంటే అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహ‌ల‌తో ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌రం మొద‌లైన‌ట్లే క‌నిపిస్తోంది. మధ్యలో జనసేనాని చేసే హడావుడికీ తక్కువలేదు.

ఈసారి ఎలాగైనా ఏపీ సీఎం సీటును సాధించాలనే తపన, తాపత్రయంతో అవిశ్రాంత పోరాటానికి దిగాడు ప్రతి పక్ష నేత వైఎస్ జగన్.. అందుకే కేవలం రేసులో రయ్యిన దూసుకుపోయే గెలుపు గుర్రాల‌కు మాత్రమే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మంచి ఆర్ధికబలం, సమాజం లో మంచి పేరు, పబ్లిక్ లో పాపులారిటీ ఉన్న పారిశ్రామిక వేత్త‌ల‌ను పార్టీలోకి దించేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ల‌లిత జ్యూయల‌ర్స్ చైర్మ‌న్ కిర‌ణ్ కుమార్ కు కూడా వైసీపీ స్కెచ్ వేసిందట. ప్ర‌స్తుతం పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ను ఆయ‌న క‌లిశార‌ని, దీంతో ఆయ‌న త్వ‌ర‌లో వైసీపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం లేకపోలేదని ప్రచారం స్టార్ట్ అయిపోయింది. కిర‌ణ్ కుమార్ ది నెల్లూరు జిల్లా.. దీంతో నెల్లూరు జిల్లా నుంచి ఆయ‌న‌కు జ‌గ‌న్ సీట్ ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

నెల్లూరు పార్ల‌మెంట్ సీట్ నుంచి పోటీ చేయాల‌ని కిర‌ణ్ కుమార్ కు జ‌గ‌న్ సూచించిన‌ట్లు వార్త‌లు పుట్టుకొచ్చాయి. కిర‌ణ్ కుమార్ కూడా రాజ‌కీయాల్లోకి ఎంట్రీకి ఉత్సుకతతోనే ఉన్నారట. అందుకే జ‌గ‌న్ కు కలిసి ఉండొచ్చని, వైసీపీలో చేరే విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిపి కూడా ఉండొచ్చని ప్ర‌చారం సాగుతోంది. ప్రతిపక్షం తరపున పోటీచేసే రిస్క్ తీసుకుంటారా? జగన్ ను కలిశారని తెలిస్తే చంద్రబాబు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? ఆయన కూడా ఆఫర్ ఇస్తే కిరణ్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇలా ఎన్నో సమాధానాల్లేని ప్రశ్నలు సోషల్ మీడియా వేధికగా అప్పుడే మొదలయ్యాయి కూడా..

ఒక్క యాడ్ తో తెలుగు రెండు రాష్ట్రాల్లో తన పేరు మరు మ్రోగిపోయేటట్లు చేసుకున్న ఘనత కిరణ్ కుమార్ ది.. ఇంతవరకు ఆయనకు ప్రజల్లో ఎంతో కొంత పాజిటివ్ టాక్ ఉన్నట్టే కనిపిస్తోంది. చదువులేకుండా సొంత తెలివి తేటలతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని స్వయంగా టీవీ ఇంటర్వ్యూ లో చెప్పుకుంటున్నారు కిరణ్ కుమార్.. ఏది ఏమైనా ఈ వార్త పై అధికారంగా ఏ ప్రకటనా రాలేదు. ఎవరో ఒకరు ఈ అంశంపై రివీల్ చేసే వరకు దీనిని వందలాది రాజకీయ ఊహాగానాల్లో ఒకటిగానే పరిగణించాల్సి ఉంటుంది.

 

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment