movies reviews

‘కృష్ణార్జున యుద్ధం’ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.మొత్తం మీద నాని నటనను, మంచి హాస్యాన్ని కోరుకునేవారిని , కొంత రెగ్యులర్ సినిమాల్ని ఎంజాయ్ చేయగలిగినవారిని ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది.

‘కృష్ణార్జున యుద్ధం’ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ మాగ్నస్ మీడియా వారు రూ. 3.50 కోట్లకు దక్కించుకున్నారు.  మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బుధవారం 148 లొకేషన్లలో ప్రదర్శించిన ప్రీమియర్ షోల ద్వారా $148,296 వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా కొన్ని స్క్రీన్లకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలు బయటకు రావాల్సింది ఉంది. ఎవరాల్ రిపోర్ట్ వచ్చే సమయానికి $200,000 వసూళ్లు మించదని అంచనా. ఇక నాని నటించి గత చిత్రం ‘ఎంసీఏ’ ప్రమియర్ షోల ద్వారా $303k గ్రాస్ వసూలు చేసింది. ‘కృష్ణార్జున యుద్ధం’ భారీ సంఖ్యలో విడుదల కావడంతో ఎంసీఏను అధిగమిస్తుందని అంతా అంచనా వేశారు

Comments

comments