politics

చంద్రబాబు కి నా పూర్తి మద్ధతు….. లాలూ

శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే అన్నట్టుగా కేంద్రప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమౌతున్నాయి. పార్లమెంటు సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా అన్న హామీలు అన్ని నిరవేర్చాల్సిందే అని టీడీపి భారత్ మొత్తం తన గళాన్ని గట్టిగా వినిపిస్తుంది. అందుకు తగినట్టుగానే ప్రతిపక్షాలన్నింటిని తన వైపు తిప్పుకుంటున్నారు బాబు.

అందుకు తగినట్టుగా టీడీపీ ఎం.పి లు అంత కలిసి వివిధ పార్టీ నేతలని కలిసి మాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎం.పి లు గల్లా జయదేవ్, గరికపాటి రామ్మోహనరావు, రవీంద్రకుమార్ బీహార్ వెళ్లి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ను కలిశారు. పార్లమెంటు లో మా పోరాటానికి మద్దతు ఇవ్వాలి అభ్యర్దించారు. ఎం.పి ల వివరణ విన్న లాలూ తప్పకుండ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

లాలూ మద్దతు తెలిపిన విషయాన్ని గల్లా జయదేవ్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి తెలిపారు.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment