news

లావణ్య త్రిపాఠిని వెంటనే అరెస్ట్ చేయండి..ఎందుకంటే …!

విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువనటి లావణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయాలంటూ ఓ అభిమాని సంచలన వ్యాఖ్య చేశాడు.. అయితే ఈ వ్యాఖ్య వెనుక ఆ అభిమాని అంతులేని అభిమానం ఉంది.. సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన ‘ఇంటిలిజెంట్‌’ సినిమాను లావణ్య తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమానికి వెళ్లిన లావణ్య పసుపు రంగు గౌనులో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది..

ఈ పిక్‌ను లావణ్యకు ట్యాగ్ చేస్తూ వరుణ్ రెడ్డి అనే నెటిజన్ ‘‘అందంగా ఉండటం నేరమైతే ఇప్పటికిప్పుడే లావణ్యను అరెస్ట్ చేయండి. ఆమె తన అందంతో చంపేస్తోంది.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీనికి వెంటనే లావణ్య రిప్లై ఇచ్చింది. ‘హా.. హా.. మా నాన్న లాయర్’ అని పేర్కొంది.. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

Comments

comments