movies

బాలీవుడ్ లోకి వెళ్తున్న మహేష్ బాబు ?

తెలుగులో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు మహిళా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఆయనకు బాలివుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఎప్పటి నుంచో మహేష్ బాబుని బాలివుడ్ లో సినిమా చెయ్యాలని అక్కడి అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరే అవకాశాలు కనపడుతున్నాయి.

`భ‌ర‌త్ అనే నేను` సినిమా విడుద‌ల త‌ర్వాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు త‌న కుటుంబంతో క‌లిసి పారిస్‌కు విహార‌యాత్రకు వెళ్లాడు. అక్క‌డ కొన్ని రోజులు స‌ర‌దాగా గ‌డిపి తిరిగి వ‌చ్చేట‌పుడు ముంబైలో కొన్ని రోజులు ఉన్నాడు. దీంతో మ‌హేష్ బాలీవుడ్ అరంగేట్రం గురించి చ‌ర్చ జ‌రిగింది.మహేష్ త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లో అరంగేట్రం చేయ‌బోతున్నాడ‌ని, అందుకోస‌మే ముంబైలో ఎక్కువ రోజులు గ‌డుపుతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

 

అయితే అవేవీ నిజం కాద‌ని తాజాగా తేలింది. మ‌హేష్ ముంబై వెళ్లింది సెల‌బ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ హ‌కీమ్ అలీమ్‌ను క‌ల‌వడానికేన‌ని స‌మాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా గడ్డంతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడపల్లితో చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మహేష్ అభిమానులు ఆయన వచ్చే ఏడాది బాలివుడ్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Comments

comments