movies

దర్శకుడి వల్ల మహేష్ కు రిస్క్

మహేష్ 25వ సినిమా ఇంకా చిక్కుల్లో నుంచి బయటపడలేదు. భరత్ అనే నేను అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకుని ఆన్ లైన్ లోకి అఫీషియల్ గా వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో టీవీలో వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ కొత్త సినిమా షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పివిపి సంస్థ వేసిన కోర్ట్ కేసు వల్ల అంతకంతకు ఆలస్యం అవుతూనే ఉంది.

తమతో  చేసుకున్న  ఒప్పందం ప్రకారం తమకు చేయాల్సిన సినిమాని వంశీ పైడిపల్లి ఇతరులకు చేస్తున్నాడు అన్న అభియోగం మీద పివిపి స్టే కోసం ప్రయత్నిస్తోంది. జూన్ 4 నుంచి 11కు మళ్ళి 18కు తీర్పు పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. కారణాలు బయటికి స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని చెప్పుకోలేరు కాబట్టి రాజు, దత్తులు  అలా కాలం వెళ్లదీస్తున్నారు. దీనికి మూల కారణం వంశీ పైడిపల్లి అన్నది స్పష్టం. అసలు పివిపి ఒప్పందాన్ని ఏ ప్రాతిపాదికన వంశీ ఉల్లంఘించాడు అనే దాని మీద క్లారిటీ రావడం లేదు.

మరోవైపు దిల్ రాజు, అశ్విని దత్ చేస్తున్న రాజీ ప్రయత్నాలు ఎంతకీ  కొలిక్కి రావడం లేదు. ఏదోలా సెటిల్ చేసుకోవడానికి పివిపి సినిమా మనిషి కాదు. వ్యాపారవేత్త. ఇది ఆయనకు జీవనాధారం కాదు. ఇది లేకపోతే ఉండలేడు అన్న సమస్యా లేదు. అలాంటాప్పుడు ఆయన తలొగ్గే ఛాన్స్  లేదు. పోనీ మూడో పార్ట్ నర్  గా ఇందులో జాయిన్ చేయిద్దామన్నా ఆయన అందుకు కూడా సిద్ధంగా లేరట. ఇంత పెద్ద సంస్థను నడుపుతూ భాగస్వామిగా ఏ సినిమాలోనూ ఉండే సమస్యే లేదని తేల్చి చెబుతున్నారట.

దీంతో  తీర్పు వెలువడ్డాక నిర్ణయం తీసుకోవాలని దిల్ రాజు అండ్ దత్ వెయిటింగ్. ఎందుకొచ్చిన గోల అనుకుని మహేష్ వేరే ప్రాజెక్ట్ చేద్దామన్నా ఆప్షన్ లేదు. ఏ దర్శకుడు కథతో సిద్ధంగా లేడు. సుకుమార్ ఇంకా ఇప్పుడు రాయడం మొదలుపెట్టాడు. సందీప్ రెడ్డి వంగా దగ్గర స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది కానీ అర్జున్ రెడ్డి హిందీ  రీమేక్ కోసం సైన్ చేసాడు కాబట్టి నో ఛాన్స్. మిగిలిన క్రేజీ దర్శకులందరు ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. సో మహేష్ కు ఎంత లేట్ అయినా దీని కోసం ఆగక తప్పదు.

Comments

comments