news

మెగాస్టార్ స్నేహంతో కింగ్ కు తంటాలు..ఎంత ప‌ని జ‌రిగిపోయింది?

నాగార్జున‌-చిరంజీవి మంచి స్నేహితులు. ఆ రిలేష‌న్ త‌మ వార‌సుల ( అఖిల్-రామ్ చ‌ర‌ణ్‌) మ‌ధ్య కూడా అలాగే కొన‌సాగుతోంది. రామ్ చ‌ర‌ణ్ ని అఖిల్ అన్న‌య్య! అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు. ఆ మ‌ధ్య చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి `హాలో` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజ‌రై అక్కినేని అభిమానుల‌ను ఖుషీ చేసారు. అంటే ? ఆ ఫ్యామిలీ మ‌ధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమ‌వుతోంది. నాగ్ త‌ర్వాత `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` హోస్ట్ బాధ్య‌తల్ని చిరు చేప‌ట్టారు. అదీ నాగ్ ప్రోత్స‌హించ‌డంతోనే చిరు ఆ స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడీ స్నేహం నాగ్-రాంగోల్ వ‌ర్మ ల‌మ‌ధ్య ఉన్న బంధానికి గండి కొట్టేలా ఉంది.

25 ఏళ్ల క్రితం నుంచి నాగ్- వ‌ర్మల స్నేహబంధం కొన‌సాగుతోంది. `శివ` సినిమాతో వ‌ర్మ ను డైరెక్ట‌ర్ ను చేసింది కింగ్ నే. స‌రిగ్గా 25 త‌ర్వాత మ‌ళ్లీ వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో `ఆఫీసర్` చిత్రం తెర‌కెక్కుతోంది. ఇదే మూవ్ మెంట్ లో శ్రీరెడ్డి వివాదంలో కీల‌క వ్య‌క్తిగా మారాడు వ‌ర్మ‌. అస‌లు క‌థ‌కు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ వ‌ర్మే అని సాక్షాలతో స‌హా దొరికేసాడు. దీంతో వ‌ర్మ‌పై నాగ్ కు ఉన్న గుడ్ ఇంప్రెసన్ కోల్పోవాల్సి వ‌చ్చింది. అటు పై రిలీజైన `ఆఫీస‌ర్` తొలి టీజ‌ర్ కూడా అభిమానుల‌కు అంత‌గా ఎక్క‌లేదు. దీంతో నాగ్ త‌న ప్రెస్టేష‌న్ అంతా వ‌ర్మ పై చూపిస్తున్నాడ‌ని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది.

ఇప్పుడా ఆ ప్రెస్టేష‌న్ మ‌రింత ఎక్కువైందంటున్నారు. మ‌రో మూడు వార‌ల్లో `ఆఫీస‌ర్` సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. కానీ వ‌ర్మ ఆ విష‌యాలేవి ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్వ‌వ‌హ‌రిస్తున్నాడుట‌. తానే ద‌ర్శ‌క‌, నిర్మాత కాబ‌ట్టి ఎవ‌డు ఏమ‌న‌డు అన్న ధోర‌ణిలో వ‌ర్మ‌కు నాగ్ రూపంలో ఊహించ‌ని ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయి. మోర‌ల్ గా బాగా దెబ్బ‌తిని ఉన్న వ‌ర్మ ఎంత మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించినా డిఫెన్స్ లో ఉన్నాడ‌న్న‌ది మాత్రం సుస్ప‌ష్టం.

Comments

comments