health

మగవాళ్లకు ఈ అలవాట్లుంటే పిల్లలు అసలే పుట్టరట!! ఎందుకో తెలుసా …!

మూడు ముళ్లతో ఒక్కటయిన ఇద్దరు మనుషుల జీవితంలోకి కొత్తగా మూడో వ్యక్తి రూపాన ఓ బుల్లి పాపాయి అడుగిడితే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఏడడుగులు నడిచి నాలుగు నెలలు గడవకముందే.. ఏమైనా విశేషమా…? అంటూ పెద్దలు ఆరా తీస్తుంటారు..? అయిదో నెల దాటిందంటే చాలు.. డాక్టర్లను ఓసారి కలవకపోయారా..? అని ఉచిత సలహాలిస్తుంటారు. భార్యాభర్తలే కాదు.. వారి కుటుంబాలు కూడా తమ ఇంట్లో బుడిబుడి అడుగులతో సందడి చేసే చిన్నారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. తాతముత్తాతల కాలం నాడయితే.. స్త్రీపురుషుల్లో సంతానోత్పత్తి శాతం 80 నుంచి 90 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది దిగ్భ్రాంతికర రీతిలో 45 నుంచి 50 శాతానికి పడిపోయింది.

మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఉద్యోగ జీవితం, టెక్నాలజీ, వాతావరణ పరిస్థితులు అన్నీ భార్యాభర్తల ఆశలను ఆవిరి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కారణం ఏదైతేనేమి పిల్లలు పుట్టని దంపతులు వైద్యులు, సంతానోత్పత్తి కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. భార్యాభర్తలకు అసలు సంతానం ఎందుకు కలగదు? శృంగార జీవితం బాగానే ఉన్నా, అనారోగ్య సమస్యలు అసలే లేకున్నా పిల్లలు ఎందుకు కలగడంలేదు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతుంది. సంతానోత్పత్తికి అవరోధంగా ఉన్న కొన్ని ప్రధాన అంశాలను వైద్యులు ఇలా వివరిస్తున్నారు.

ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తూ ఒళ్లు తగ్గించుకుంటూ, ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు పట్టణ ప్రజలు. ఎంత ఎక్కువసేపు వ్యాయామం చేస్తే అంత మంచిదని భావించేవాళ్లు కూడా లేకపోలేదు. కానీ ఈ వ్యాయామం కూడా పిల్లలు పుట్టే విషయంలో కీలక పాత్ర వహిస్తుంది. సాధారణ బరువు ఉన్న ఓ స్త్రీ.. వారానికి అయిదు గంటలకు మించి వ్యాయామం చేస్తే సంతానం కలగడం ఆలస్యమవుతుందట. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నా సరే, పిల్లలు ఆలస్యంగా పుట్టే అవకాశం ఉందట. అదే పురుషుల విషయానికి వస్తే మాత్రం వ్యాయామం చేసే సమయం ఎక్కువగా ఉంటేనే మంచిదట. వారానికి కనీసం 15 గంటల పాటు జిమ్‌లో కష్టపడే వారిలో వీర్యకణాల వృద్ధి 73 శాతం ఎక్కువగా ఉంటుందట.

మగాళ్లు చాలా మంది తమ ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు ముగిసిన తర్వాత ఇంటికి వచ్చినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ టీవీని అస్సలు వదలరు. అలాంటి వాళ్లు సంతానం విషయంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువేనని బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. వారానికి 20 గంటలకు మించి టీవీల ముందు కూర్చునే పురుషుల్లో వీర్యకణాల వృద్ధి తగ్గిపోతుందట. ఏదో ఒక పని కల్పించుకుని ఇంట్లో భార్యకు సాయం చేయడమో, లేక సరదాగా బయటకు వెళ్లడమో చేస్తే టీవీ చూడాలన్న కోరికను కట్టిపెట్టొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

హైదరాబాద్ లో నెలకు ఓ వ్యక్తి సగటున అయిదు కిలోల మాంసం తింటున్నాడని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. దేశంలోనే అత్యంత ఎక్కువగా మాంసం వినియోగం ఇక్కడే ఉందట. అయితే మాంసాహార అలవాటు కూడా సంతాన లోపానికి ఓ కారణమట. ఎద్దు, గొర్రె, పంది, మేక, గుర్రం వంటి మాంసాలను ఎక్కువగా తినే పురుషుల్లో వీర్యకణాల వేగం మందగించడంతోపాటు, వాటి వృద్ధి కూడా తగ్గిపోతుందట. ఎపిడెమియోలజీ హెల్త్‌ జర్నల్‌ ప్రచురించిన ఈ సర్వేలో ఆసక్తికరమయిన విషయాలెన్నో వెల్లడయ్యాయి. ఈ మాంసాల కంటే.. గుడ్లు, రోస్ట్‌ చికెన్ తినే పురుషుల్లో వీర్యకణ వృద్ధి ఎక్కువగా ఉంటుందట. అయితే మాంసం తిన్నా.. వాటి వల్ల వచ్చే కొవ్వును కరిగించే స్థాయిలో పనిచేస్తే ఇటువంటి సమస్యలు ఉండబోవని మరో సర్వేలో వెల్లడయింది.

మగవాళ్లు ఫోన్లను ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటారు. మొబైల్స్‌ నుంచి విడుదలయ్యే ఎలక్ట్రోమాగ్నటిక్‌ సిగ్నల్స్‌.. వృషణాల్లో జరిగే వీర్యకణ ఉత్పత్తిని అడ్డుకుంటాయట. ఫోన్ల నుంచి విడుదలయ్యే ఉష్ణం వృషణాల్లో వేడిని పెంచి, వీర్యకణాలను శక్తిహీనం చేస్తాయట. తద్వారా పురుషుల్లో సంతానలోపం కలిగించడంలో సెల్‌ఫోన్లు ఇలా ప్రముఖ పాత్ర వహిస్తాయని ఓ పరిశోధనలో వెల్లడయింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ చేసిన ఓ పరిశోధనలో ఈ ఆసక్తికరమయిన విషయం వెల్లడయింది. లావుగా ఉన్న వారికి పిల్లలు పుట్టకుండా ఉన్నట్లయితే, అటువంటి వారు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తే, ఆరు నెలల్లో సంతానం కలిగే అవకాశాలు మెండుగా పెరుగుతాయని పరిశోధనలో కీలక పాత్ర వహించిన డాక్టర్‌ బిట్నెర్‌ స్పష్టం చేశారు. లావుగా ఉండే భార్యాభర్తల మధ్య శృంగార జీవితం సంతృప్తికరమైన స్థాయిలో ఉండదనీ, బరువు తగ్గితే ఇది కొంత ఆశాజనకంగా ఉంటుందంటున్నారు.

సంతానోత్పత్తికి శృంగారం ఎంత ముఖ్యమో వేరుగా చెప్పనక్కర్లేదు. కానీ ఉద్యోగం, డబ్బు, ఫ్రెండ్స్‌, పార్టీలు అంటూ బిజీ అయిపోయి శృంగారజీవితాన్ని మర్చిపోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అలాంటివారే ఎక్కువగా సంతాన సాఫల్య కేంద్రాల ముందు నిలబడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారంటే, వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు లెక్క. ఈ లెక్క మించినా ఫరవాలేదు. కానీ స్త్రీల అండోత్పత్తికి అనుగుణంగా శృంగారాన్ని సరిచూసుకుంటే మంచిది.

అంతేకాదు రోజులో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే వీర్యకణాలు వృథా అవుతుంటాయని డాక్టర్‌ బిట్నెర్‌ వివరిస్తున్నారు. అండోత్పత్తి సమయంలో జరిగే శృంగారంలో తగినంత స్థాయిలో వీర్యకణాలు విడుదలవకపోతే మొదటికే మోసం వస్తుందంటున్నారాయన. తాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్లల్లో 13శాతం మంది సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవాళ్లేనని అమెరికన్ సొసైటీ ఆఫ్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్ చేసిన పరిశోధనలో తేలింది. మహిళల్లో అండోత్పత్తికి సిగరెట్‌ అలవాటు అడ్డుపడితే, పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని నాశనం చేస్తుంది. యువకులు, కొత్తగా పెళ్ళయిన వాళ్లయినా ఈ విషయం తెలుసుకుని సిగరెట్‌ మానితే సంసార బంధం చక్కగా సాగిపోతుంది.

Comments

comments