movies news

మగాళ్లను కూడా రూమ్ కి రమ్మంటారు !!

కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు కేవలం ఆడవాళ్లకే పరిమితం అనుకుంటాం కానీ మారుతున్న కాలంలో అవి మగాళ్లకు కూడా తప్పడం లేదు. కాకపోతే సమాజంలో మహిళాపై ఉన్న సానుభూతి మగాడి పై ఉండదు కనక వీటిని ఎవరు అంతగా పట్టించుకోరు. రేస్ గుర్రం విలన్ రవి కిషన్ ఈ కోణంలోనే కొత్త విషయాలు చెబుతున్నాడు. టాప్ రేంజ్ లో ఉండే కొందరు హీరోయిన్స్ తమ కోరికలను తీర్చుకోవడానికి బాగా అందంగా కనిపించే వయసులో ఉన్న మగ ఆర్టిస్టులను వాడుకోవడం సర్వ సాధారణమని, బయటికి చెప్తే నానా రచ్చ అవుతుంది కనక ఎవరూ చెప్పుకోరని తేల్చి చెప్పాడు.

పేర్లు చెబితే కొంపలు అంటుకుంటాయి కాబట్టి రవి కిషన్ వాటిని మాత్రం బయట పెట్టలేదు. శ్రీరెడ్డి వివాదం గురించి ఒక ఇంగ్లీష్ పత్రిక అడిగిన ప్రశ్నకు బదులుగా రవి కిషన్ ఇది చెప్పాడు. భాషతో సంబంధం లేకుండా ప్రతి చోటా ఆడా మగ అనే తేడా లేకుండా ఇవి కొనసాగుతూనే ఉన్నాయని అరికట్టడం అంత సులభం కాదని తేల్చేసాడు.

రవి కిషన్ దగ్గరి నుంచి చూసి ఉంటాడు కాబట్టే ఇలాంటివి బయటికి చెప్పాడా లేకా తనే స్వయంగా బాధితుడా అనేది మాత్రం ఆయనకే తెలుసు. భోజ్ పూరిలో రవి కిషన్ స్టార్ హీరో. అక్కడ తీసేవన్నీ లో బడ్జెట్ సినిమాలు కాబట్టి ఆదాయం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. అందుకే రవి కిషన్ బాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి  వచ్చే ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు.

రేస్ గుర్రం చాలా పేరు తీసుకురావడంతో ఇక్కడ  ఆఫర్స్ బాగా  వస్తున్నాయి. ఇప్పుడు రవి కిషన్ చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించో అర్థం చేసుకోవడం కష్టం కానీ బయటికి రాని ఆ మగ  పుంగవులమీద సానుభూతి కలగడం సహజం. శ్రీరెడ్డి తరహాలో ఎవరైనా మేల్ ఆర్టిస్ట్ నిరసనకు దిగితే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే.

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment