health

పాలలో కలిపి తాగండి … నిద్ర పోండి సుఖం గా!!

పని ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, పిల్లల టెన్షన్లు వెరసి చాలా మందికి సుఖమైన నిద్ర కరువైంది. దీంతో నిద్రకోసం అల్లోపతి మందులను (నిద్ర మాత్రలు) వాడుతూ కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. నిద్రకు దీర్ఘకాలం ఇంగ్లిష్ మెడిసిన్ వాడితే వాటికి ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఇక ఆ మాత్రలు, అంతకంటే ఎక్కువ డోస్ వి వేసుకుంటే మినహా నిద్రపట్టని స్థితిలోకి నెట్టివేయబడతాం.

అదే ఆయుర్వేద మూలిక అశ్వగంధ లో నిద్రను పెంచే దివ్యమైన ఔషదగుణాలున్నాయి. ఇది నిద్ర పోవడాన్ని ప్రోత్సహించడమే కాదు మెదడుపై అనుకూల ప్రభావాలు చూపిస్తుంది. టెన్షన్, చిరాకులను తగ్గించి కండరాలను శాంతపర్చే అద్భుతమైన గుణాలు అశ్వగంధలో ఉన్నాయని చాలా పరిశోధనల్లో వెల్లడైంది.

అశ్వగంధ ఏం చేస్తుంది?

నిద్రాభంగానికి ముఖ్య కారణం ఒత్తిడి, ఉద్రేకతలు. ఈ ఔషదం తీసుకుంటే వాటికి కారణమయ్యే అధివృక్క (అడ్రినల్) గ్రంధి నుండి కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కార్టిసాల్ నియంత్రణలో ఉంటే డిప్రెషన్, రక్త పీడనం, ఇన్సొమ్నియా వ్యాధిలు రావు.

అశ్వగంధ కార్టిసాల్ విడుదలను తగ్గించి నిద్రపోయేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాదు అశ్వగంధ శరీరానికి విశ్రాంతిని చేకూర్చి, శరీరంలోని అన్ని అంగాలు సరిగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది. అవయవాల విధుల్లో లోపాలను ఉంటే తక్షణం సరిచేసి విధిని సరిగా చేసేలా చేస్తుంది.

అశ్వగంధను ఎంత తీసుకోవాలి?

ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణం పొడిని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకుని నిద్రించే సమయంలో తాగాలి.

ఈ విధంగా కనీసం 10 నుంచి 15 రోజుల పాటు వాడితే నిద్ర పట్టకపోవడమనేదే ఉండదని పరిశోధనాత్మకంగా రుజువైంది.

కాబట్టి నిద్ర మాత్రలకు బదులు అశ్వగంధను తగిన మొత్తంలో తీసుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

Comments

comments