health

మినరల్ వాటర్ త్రాగుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన …. !

ఖర్చు భారమైనా అందరూ మినరల్ వాటర్ నే తాగుతున్నారు. ఇక షాపుల వద్దా పేరున్న కిన్లే, బిస్లరీ వాటర్.. కొని తాగి ఇకమేము సేఫ్ అనుకుంటున్నారా? అయితే ఇది మీరు తెలుసుకుని తీరాల్సిన విషయం. మీరు తాగే మినరల్ వాటర్ కంటే రోడ్ మీద ఉన్న నల్ల, బోరింగ్ నుండి వచ్చే నీరే స్వచ్చమైనవి అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. ఎందుకంటే మినరల్ వాటర్ తయారుచేసే చాలా కంపెనీలకు సరైన లైసెన్సులే లేవంటున్నారు.

మన దేశంలో మొత్తం 6000 మినరల్ వాటర్ ప్యాకేజింగ్ కంపెనీలుంటే వాటిలో 4500 యూనిట్లకు సరైన లైసెన్సులే లేవని తాజాగా వారు బాంబు పేల్చారు. మరీ విచిత్రం ఏమిటంటే సరైన లైసెన్స్ లేకుండా మినరల్ వాటర్ తయారుచేస్తున్న కంపనీలలో కిన్లే, బ్లిస్లరీ, యాక్వఫినో కంపెనీలకు చెందిన బ్రాంచ్ లు కూడా ఉన్నాయి. చాలా మినరల్ వాటర్ కంపనీలకు అసలు మినరల్ వాటర్ అంటే ఏమిటో? అందులో ఏం ఉండాలో కూడా తెలియదని, నీటిని ప్రమాణాలకు తగ్గట్లు శుభ్రపరచకుండా అలాగే బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నారనని చావు కబురు చల్లగా చెబుతున్నారు.

బ్రాండెడ్ కంపెనీ అని చెప్పుకుంటూ నాసిరకం వాటర్ అమ్ముతున్నారంటూ పబ్లిక్ నుంచి ఫిర్యాదులు అందడంతో ఈ పరిశీలన మొదలుపెట్టారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా సరైన లైసెన్స్ లేని కంపెనీల లిస్ట్ తయారు చేయాలని ఆదేశించారు అధికారులు. అలాగే ప్రతి కంపెనీ కచ్చితంగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాల నుంచి కచ్చితంగా రెండు లైసెన్సులు పొంది ఉండాలని ఆదేశించారు. అవి ఎప్పటికి అమలవుతాయోగాని ఇప్పటికైతే మనం సేఫ్ కాదని తేలిపోయింది.

అలాంటి పేరున్న పెద్ద కంపెనీలకే లైసెన్స్ లు లేవంటే మన గల్లీలలో ఉండే మినరల్ వాటర్ ప్లాంట్ లలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. నీళ్ళని ప్యూరిఫై చేయకుండా రుచిగా ఉండేందుకు కొన్ని ప్రమాదకరమైన రసాయనాలని కలుపుతారు. ఆ నీటినే పదే పదే తాగడం వల్ల చాలా రోగాలు వస్తాయి. మినరల్ వాటర్ తాగడం కంటే నల్ల నీళ్లనే మన ఇంట్లోనే ప్యూరిఫై చేసుకొని తాగడం చాలా ఉత్తమం. ఇప్పుడు మన ఇంట్లోనే వాటర్ ని ప్యూరిఫై చేసుకునేట్టుగా చాలా పరికరాలు మార్కెట్ లోకి వచ్చాయి..!

Comments

comments

Recent Posts