movies

నా పేరు సూర్య ఫస్ట్ డే కలెక్షన్స్…

టాలీవుడ్ లో సంవత్సరం నుంచి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఇటీవల కాలంలో తెలుగులో దేశభక్తిని ప్రేరేపించిన సినిమాలు రాకపోవటం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూర్తి స్థాయి ఆర్మీ ఆఫీసర్ గా నటించటం వంటి విషయాలు సినిమాపై అంచనాలను పెంచేసాయి. మాస్ పల్స్ తెలిసిన రచయత వక్కతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా టిక్కెట్స్ వారం ముందే అమ్ముడయ్యి పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బన్నికి మంచి పాలోయింగ్ ఉన్న తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కన్పిస్తుంది.

ఇక ఒక రోజు ముందు US ధియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాను చూసి స్టైలిష్ స్టార్ ఫాన్స్ ఉగిపోతున్నారని చెప్పాలి. ప్రీమియర్స్ కి ముందే మొదలైన సందడి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకు నార్త్ అమెరికాలో 120 స్క్రీన్ లలో ప్రదర్శన జరిగితే కోటి రూపాయిల గ్రాస్ దిశగా దూసుకువెళ్ళుతుంది.

ఇంకా షోస్ మిగిలి ఉండటంతో మరిన్ని కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు,పొరుగు రాష్ట్రాల కలెక్షన్స్ పరిశీలిస్తే…తొలి రోజు ఈవెనింగ్ షోస్ వరకు అందిన సమాచారం ప్రకారం 41 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే నా పేరు సూర్య నాన్ బాహుబలి రికార్డ్స్ సమీపంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రీమియర్స్ లో S% సత్యమూర్తి అత్యధిక వసూళ్లుగా నిలిచింది.

Comments

comments