movies

రంగస్థలం 200 కోట్లు…భరత్ అనే నేను ఎన్ని కోట్లు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం థర్డ్ హైయెస్ట్ గా నిలిచిందని నిర్మాతలు ప్రకటించారు. బాహుబలి రెండు భాగాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా రంగస్థలం మూడో స్థానంలో ఉందని తెలిపారు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో 200 కోట్ల మైలు రాయిని దాటేశాడు. ఈ మేరకు సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. మేడే శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఆ పోస్టర్ లో రంగస్థలం 200 కోట్ల రూపాయిల వసూళ్లను సాధించిందని పేర్కొన్నారు.

మార్చి 30 న విడుదల అయినా రంగస్థలం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో మంచి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. 200 ల కోట్ల వసూళ్లను సాధించిందని చేసిన నిర్మాతల ప్రకటన మెగా అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

బాహుబలి 2 ఇప్పటికి నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. బాహుబలి 1 రెండో స్థానంలో ఉంది. నిర్మాతల ప్రకటనను బట్టి 200 కోట్లతో రంగస్థలం మూడో స్థానంలో నిలిచినట్టే. భరత్ అనే నేను సినిమా ఇంకా 200 కోట్ల మైలురాయిని చేరలేదు.

దాంతో మహేష్ భరత్ అనే నేను ప్రస్తుతానికి నాల్గో స్థానంలో ఉందని, అయితే రాబోయే రోజుల్లో భరత్ అనే నేను 200 కోట్లు దాటేసి రంగస్థలం ను కిందకి నెట్టేసి భరత్ అనే నేను మూడో స్థానంలోకి వెళ్ళటం ఖాయం. ఇప్పటికే భరత్ అనే నేను 185 కోట్ల వసూళ్లను దాటేసింది.

Comments

comments