movies

ఇక ఆన్లైన్ లో రంగస్థలం చూసేయండి

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంతా జోడిగా వచ్చిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయినా ఈ సినిమా తిరుగులేని రికార్డ్స్ సాధిస్తూ ముందుకు సాగుతుంది. ధియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా ఇక ఆన్లైన్ లో సందడి చేయటానికి రెడీ అయ్యిపోయింది.

ఈ సినిమా విడుదల అయిన 45 రోజులకు ఆన్లైన్ లో విడుదల చేయవచ్చని మైత్రి మూవీ మేకర్స్,అమెజాన్ ప్రైమ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ తో దూసుకువెళ్ళుతుంది. దాంతో మైత్రి మూవీ మేకర్స్ వారు అమెజాన్ ప్రైమ్ వారిని రిక్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఒకేవేళ చిత్ర నిర్మాతల రిక్వెస్ట్ ని అమెజాన్ ప్రైమ్ ఒకే చేస్తే రంగస్థలం సినిమాను ఆన్లైన్ లో మే 18 నుంచి చూడవచ్చు. ఒకవేళ అమెజాన్ ఆ రిక్వెస్ట్ కి నో చెప్పితే మే 13 నుంచే రంగస్థలం సినిమాను ఆన్లైన్ లో చూడవచ్చు. ఆన్లైన్ లో కూడా చిట్టిబాబు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Comments

comments