news

మహానటి మొదటి రోజు వసూళ్లు

మౌత్ పబ్లిసిటీతో పాటు ఆన్ లైన్ ఫీడ్ బ్యాక్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో రంగస్థలం, భరత్ అనే నేను తర్వాత మహానటినే. సావిత్రి గారి బయోపిక్ ని ఎలా డీల్ చేసి ఉంటారు అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ దర్శకుడు నాగ అశ్విన్ చేసిన ప్రయత్నం అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది.

కీర్తి సురేష్ తో పాటు దుల్కర్ సల్మాన్, సమంతా పాత్రలకు అన్ని వర్గాల నుంచి ప్రశంశలు దక్కుతున్నాయి. ఇక వసూళ్ళ పరంగా చూస్తే స్టార్ పవర్ లేకపోవడంతో ఉదయం ఆటలు కాస్త డల్ గానే ప్రారంభమైనా మధ్యాన్నం షోకి టాక్ వేగంగా స్ప్రెడ్ కావడంతో కలెక్షన్స్ లో కూడా వేగం పెరిగింది. కాని జరిగిన బిజినెస్ ప్రకారం చూసుకుంటే మహానటి భారీ లాభాలతో సాగేలా ఉంది. ఇక ఏరియాల వారిగా వసూళ్లు చూద్దాం

నైజాం – 66 లక్షలు

ఉత్తరాంధ్ర – 18 లక్షలు

సీడెడ్ – 13 లక్షలు

గుంటూర్ – 9 లక్షలు

కృష్ణా – 15 లక్షలు

ఈస్ట్ – 10 లక్షలు

వెస్ట్ – 6 లక్షలు

నెల్లూరు – 4 లక్షలు

తెలుగు రాష్ట్రాలు మొత్తం షేర్ – 1 కోటి 42 లక్షలు

ఓవర్సీస్ లో ఇక్కడ కన్నా మెరుగ్గా రాబడుతున్న మహానటి బుధవారం వేసిన ప్రీమియర్ల నుంచి మొత్తం 3 లక్షల 4 వేల డాలర్లు రాబట్టగా గురువారం వచ్చిన 1 లక్షా 95 వేల డాలర్లతో కలుపుకుంటే రెండు రోజులకే అర మిలియన్ దాటేసింది. వీక్ ఎండ్ చాలా బలంగా ఉన్న నేపధ్యంలో ఈజీగా రెండు మిలియన్లు దాటడమే కాదు మూడు వైపు పరుగులు పెడుతుంది అని అక్కడి ట్రేడ్ రిపోర్ట్ . స్క్రీన్లు తక్కువగా దొరకటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు కొంచెం నెమ్మదిగా ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో ఊహించని సంఖ్యలో అదనపు స్క్రీన్లు జోడించబోతున్నారు అని సమాచారం.

Comments

comments