movies reviews

మహానటి ప్రీ రివ్యూ !!

సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు సంవత్సర కాలంగా అదుగో ఇదుగో మహానటి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఊరిస్తూ, వస్తున్నారు. ఎట్టకేలకు సావిత్రి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. సావిత్రి జీవితం గురించి చాలా విషయాలను తెలుసుకోవాలని ఆమె అభిమానులు, ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులున్నారు.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగింది. దాంతో పాటు సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించడం జరిగింది. మహానటి ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. దాంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ అద్భుతమైన నటనతో పాటు మంచి మేకప్తో అచ్చు సావిత్రిని తలపిస్తుంది. ఇక మధురవాణి పాత్రలో సమంత, విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ, ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, క్రిష్, షాలిని పాండేలు నటించడం జరిగింది. తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయేలా ఈ చిత్రం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరికొన్ని గంటల్లో మహానటికి సంబంధించిన రహస్యాలు ఎన్నో రివీల్ కాబోతున్నాయి.

 

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment