news

షాక్: రెండేళ్లుగా ముమైత్ ఖాన్ కు “ఆ వ్యాధి” !!

2006 లో వచ్చిన పోకిరి సినిమా ఎన్ని సంచలనాలను క్రియేట్ చేసిందో మనకి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక డాన్సర్ కు పేరొచ్చినంతగా ఇంకెవరికీ రాలేదంటే అది అతిశయోక్తి కాదు. ఆమె ఎవరో కాదు ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. నిజానికి ఈ సినిమాకంటే మూడు సినిమాల్లో చేసినప్పటికీ ఇంతపేరును సంపాదించలేకపోయింది.

తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో తన డ్యాన్స్ లతో మైమరపించిన ముమైత్ ఖాన్ తెలుగులో నటించిన చివరి చిత్రం 2016లో వచ్చిన ‘తిక్క’. ఈ సినిమా తర్వాత ఆమె స్క్రీన్ పై కనపడలేదు. తాను ఇన్నాళ్లూ తెరపైకి రాకవపోడానికి గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా ముమైత్ ఖానే వెల్లడించింది. రెండేళ్ల పాటు తాను మూర్ఛ వ్యాధితో బాధపడ్డానని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నానని చెప్పింది. వైద్యులు సూచనల మేరకు రెండేళ్ల వరకు ఎలాంటి బరువులు మోయకూడదని చెప్పారని తెలిపింది.

ఇక ఐటమ్ సాంగ్ అంటేనే చాలు ముమైత్ ను ఎంపికచేసేవారు. అయితే ఉన్నట్లుండి 2016 తరువాత ఆమె తెరమీద కనిపించడం మానేసింది. నిజానికి ఆమెకు అవకశాలు తగ్గిపోవడంవల్ల ఆమె ముంబై వెళ్ళిపోయింది అని అందరూ అనుకుంటున్నా సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్ షో కి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాను తెరమీద మళ్ళీ కనిపించడానికి ఎందుకు ఇంత సమయం పట్టిందో గల కారణాలను ఆమె తన ఫేసుబుక్ పేజీలో రాసుకొచ్చింది.

అంతేకాదు..తాను గత రెండేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అధిక బరువులు మోయవద్దని డాక్టర్లు సూచించారని, వారి సూచనల మేరకు తగు చికిత్సను తీసుకుంటున్నానని చెప్పింది. మూర్ఛవ్యాధిని అరికట్టే లిపివిల్ అనే ఔషధం ద్వారా తాను లావెక్కిన్నట్లు తెలిపింది. తనకు బరువు పెరగడం ఒక సమస్యకాదని, అనుకున్న టైంలో అనుకున్న శరీరాకృతిని సాధించే సత్తా, నమ్మకం తనకు ఉందని చెప్పింది. సమాయానికి భోజనం చేయడం, తగినంత నీరు తీసుకోవడం, ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాం అని సలహాలు కూడా ఇచ్చేస్తుంది.

Comments

comments