health

పుట్టగొడుగులను తింటే నిత్య యవ్వనంగా ఉండొచ్చు

ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే… ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయన్న సంగతి మాత్రం మనలో చాలామందికి తెలియదు. నిత్యం యవ్వనంగా ఉండాలంటే మీరు పుట్టగొడుగులు తినాలి. పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ః అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు ప్రధానం కారణం. ఇతర ఉడికించిన కూరగాయల మాదిరిగా పుట్టగొడుగులను ఉడికించినప్పటికీ… వాటిల్లోని యాంటీ ఆక్సీడెంట్ల శాతం ఏమాత్రం మారదు.

హానికారక ఫ్రీరాడికల్స్

మనం తీసుకున్న ఆహారం ఆక్సీకరణకు గురైనప్పుడు హానికారక ఫ్రీరాడికల్స్ శరీరంలోకి విడుదలవుతాయి. ఇవి శరీర కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా క్యాన్సర్, గుండె సంబంధ సమస్యలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు సంభవిస్తాయి. చివరకు డీఎన్‌ఏపై కూడా ఇవి ప్రభావం చూపి, వృద్ధాప్యానికి కారణమవుతున్నాయి. అయితే పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ ఎక్కువ విడుదల కాకుండా చేస్తాయి.

ఆరోగ్యానికి ఎంతో మంచిది

వేసవికాలంలో పుట్టగొడుగులను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వీటిల్లో బలవర్థక విటమిన్లకు కొరతే లేదు. ఈ సీజన్లలో బాగా దొరికే పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవేమిటంటే …

మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు

పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇందులో డి-విటమిన్‌ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు. ముఖానికి రాసుకునే సీరమ్స్‌లో పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు ఉంటాయి.

యాంగ్జయిటీలను తగ్గిస్తుంది

బి1, బి2, బి3, బి5, బి9లు వీటిల్లో ఉన్నాయి. ఇందులోని విటమిన్‌-బి ప్రధానంగా ఒత్తిడి, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.

ఎలర్జీలు, ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల నివారణలో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ గుణాన్ని కలిగివుంటాయి.

చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది

పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రైటింగ్‌ గుణాలున్నాయి. అందువల్ల చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. పుట్టగొడుగులు తీసుకోవడంవల్ల వయసు కనపడదు. ముఖ్యంగా చర్మం కాంతి విహీనం కాదు. స్కిన్‌టోన్‌ దెబ్బతినదు. వయసు మీదపడ్డం వల్ల తలెత్తే మచ్చలను కూడా ఇవి నివారిస్తాయి. పుట్టగొడుగుల్లో విటమిన్‌-డితో పాటు యాంటి-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

Comments

comments