movies

నా పేరు సూర్య ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోర్డర్ లో సైనికుడిగా సత్తా చాటే కథాంశంతో ‘నా పేరు సూర్య’ అంటూ మే 4 న అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా బిజినెస్ కూడా బన్ని కెరీర్ లో ఎప్పుడు జరగనంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరుస విజయాలతో దూసుకువెళ్ళుతూ స్టార్ డమ్ ని పెంచుకుంటున్న బన్ని కెరీర్ లో ఒకదానికి మించి మరొకటి హిట్ కొడుతూ వస్తున్నాడు. సరైనోడు,డీజే సినిమాల సక్సెస్ తో తన సత్తా చాటిన బన్ని ఇప్పుడు ఆ సక్సెస్ సినిమాల సరసన నా పేరు సూర్య కూడా చేరటం ఖాయమని అంటున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 77. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. డీజే కలెక్షన్స్ కి దగ్గరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగటం విశేషము.

ఓవర్సీస్ లో కూడా బన్ని సినిమా బిజినెస్ 7.2 కోట్లతో బిజినెస్ జరిగింది. ఇక ఏరియాల వారీగా నా పేరు సూర్య బిజినెస్ ఎలా జరిగిందో చూస్తే నైజం 20.2 కోట్లు, సీడెడ్ 11.25 కోట్లు, ఉత్తరాంధ్ర 8.5 కోట్లు, గుంటూరు 5.5 కోట్లు ఈస్ట్ 5.2 కోట్లు, వెస్ట్ 4.20 కోట్లు,కృష్ణ 4.20 కోట్లు,నెల్లూరు 2.60 కోట్లు,రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ 61.96 కోట్ల బిజినెస్ చేయగా రెస్ట్ అఫ్ ఇండియా 8.60 కోట్లతో భారీగా బిజినెస్ చేసింది. రచయత వక్కతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మించారు.

Comments

comments