movies

ఇక జబర్దస్త్ లో నాగబాబు, రోజా కలిసి కనిపించరు !

నాగబాబు.. మెగా బ్రదర్ గా, మెగా ఫ్యామిలీ అభిమానులకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ బిల్డ్ చేసుకునే అవకాసం ఏమి లేకుండా పోయింది . అన్నయ్య చిరంజీవి మెగా స్టార్ … తమ్ముడు కళ్యాణ్ పవర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. నాగబాబు విషయానికి వస్తే నిర్మాతగా చేసి సక్సెస్ కాలేకపోయారు. చరణ్ తో ‘ఆరంజ్’ సినిమా తీసి ఆస్తులన్నీ పోగొట్టుకుని దాదాపుగా రోడ్డు మీదకు వచ్చే స్థితి వచ్చిందని కూడా ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇక నటుడిగా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ జాగ్రత్తగా కెరీర్‌ను నెట్టుకొస్తున్నాడు నాగబాబు. ఆ అన్నదమ్ములంటే ప్రాణం పెట్టే నాగబాబు… మెగాభిమానులకు సైతం పెద్ద దిక్కు అనే చెప్పుకోవాలి. నాగబాబు కెరీర్ లో గ్రేట్ ఎచీవ్ గురించి చెప్పుకోవాల్సివస్తే అది ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ సక్సెస్ కావడమే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్, కత్తి మహేష్, రోజా, హైపర్ ఆది, బండ్ల గణేష్ తదితర గొడవలతో రోజా, నాగబాబు కలిసి జాయింట్ గా ఈ నెంబర్.1 (టాప్ రేటింగ్) ప్రోగ్రాంకి జడ్జిలుగా చేసే పరిస్థితి లేదని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా పూర్తయిపోయాక జనసేన పార్టీకి టెంపో క్రియేట్ చేసేందుకు ‘చలోరేచలోరేచల్’ అనే ప్రోగ్రాం తలపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత జగన్ పై గతంలో ఎన్నడూలేనంత తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. దీంతో వైఎస్ఆర్ పార్టీపైన, జగన్ పైన ఈగవాలినా ఒంటికాలిపై లేచే రోజా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇక పవన్ అభిమానుల మూర్ఖత్వం, భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అలాంటి వీర భక్తుళ్లలో ఏ1 బండ్ల గణేష్ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని రోజాను అనరాని మాటలన్నారు. అయితే ఏమాటకు ఆ మాట రోజా కూడా తెలిసి తెలిసి బండ్ల గణేష్ నోట్లో నోరు పెట్టారు. ఎంఎల్ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి స్థాయిని సైతం ఖాతరు చేయకుండా గణేష్ మాటలు అనేశాడు.

అది చినికి చినికి గాలీవానగా మారిపోయింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు గుప్పించింది. పైగా ఈ తిట్ల పురాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో పవన్ అభిమానులు రోజాపై మండిపడుతున్నారు. అంతే కాదు… ఆమెతో కలసి నాగబాబు ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్‌లో పాల్గొనకూడదని కోరుతున్నారట. తనకంటూ ఎంతో క్రేజ్‌ను తెచ్చిన ‘జబర్దస్త్’ నాగబాబుకు లైఫ్ అనే చెప్పుకోవాలి.

ఇప్పుడు పవన్ అభిమానుల కోరిక మేరకు నాగబాబు ఆ ప్రోగ్రామ్ నుండీ తప్పుకుంటాడా లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. అభిమానుల మాటలకు పెద్ద విలువ ఇవ్వకుండా రోజాతో కలసి ‘జబర్దస్త్’లో పాల్గొంటే… భవిష్యత్తులో ఎక్కడో ఓ చోట ఫ్యాన్స్‌కు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ వారి కోరిక మేరకు కార్యక్రమానికి దూరమైతే… మంచి అవకాశాన్ని వదులుకున్నట్టవుతుంది. దీంతో నాగబాబు పరిస్థితి ముందు నుయ్యి… వెనుక గొయ్యి అయింది. మరి బండ్ల గణేశ్ – రోజా మాటల యుద్ధం కారణంగా పరోక్షంగా నాగబాబుకు సమస్య వచ్చింది… మరి ఈ సమస్య నుండి నాగబాబు ఎలా బయటపడతాడో చూడాలి.

Comments

comments