politics

పవన్ పోటీకి నియోజకవర్గం మారిందట

వచ్చే ఎన్నికల్లో తను, తన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉంటామని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇది వరకే ప్రకటించారు. తను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. ఇటీవల జనసేన బాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉంటుందని తెలిపారు. ఒక దశలో బలం ఉన్న చోటే పోటీ అని చెప్పిన పవన్ కల్యాణ్ తాజాగా అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ అని అన్నారు.

 

ఇక పవన్ ప్రత్యక్ష పోటీ గురించి మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. తను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. ఆ తర్వాత ఒకసారి రాయలసీమ నుంచి పోటీ అనే మాట కూడా అన్నారు. అయితే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా ఇన్‌చార్జి ముత్తంశెట్టి కృష్ణారావు చేసిన ఒక ప్రకటన ఆసక్తిదాయకంగా మారింది.

పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తారని ముత్తంశెట్టి ప్రకటించారు. ఈ జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. ఆ మేరకు ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ గతంలో ప్రకటించినా, జనసేన నేతలు మాత్రం పవన్ పోటీ అవనిగడ్డ నుంచి అని అంటున్నారు. ఈ విషయంలో కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అవనిగడ్డలో ప్రస్తుతం తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మండలి బుద్ధ ప్రసాద్ ఉన్నారు. ఈయన స్వల్ప మెజారిటీతో గత ఎన్నికల్లో గెలిచాడు. 2009ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ ను దెబ్బతీసింది. త్రిముఖ పోటీలో నాటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మండలి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి 37వేల ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచాడు. అవనిగడ్డ సరే? అనంతపురంనుంచి పోటీ చేస్తానన్న పవన్ మాట ఏమైనట్టు?

Comments

comments