movies news politics

ప‌వ‌న్ సినిమాకి కులం రంగు !!?

అదేంటి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు చేయ‌డం లేదు.. దాదాపు యాక్టింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాడ‌నే రూమ‌ర్‌లు ఉన్న స‌మ‌యంలో ఆయ‌న సినిమాకి కులం రంగు అంటుకుంటోంద‌ని అనుకుంటున్నారా..? లేక ఇది పాత సినిమా అని భావిస్తున్నారా..? అయితే, ఇక్క‌డే ఉంది అస‌లు క‌థ‌..

ప‌వ‌న్ హీరోగా సినిమాల‌కి, మేక‌ప్‌కి రెస్ట్ ఇచ్చినా ఆయ‌న ఓ సినిమాని నిర్మిస్తున్నాడ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. నితిన్ హీరోగా తెర‌కెక్కుతోన్న చ‌ల్ మోహ‌న‌రంగా సినిమాకి మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో క‌లిసి ప‌వ‌న్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్ క‌లిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌పై ఇప్పుడు వివాదం రేగుతోంది. మోహ‌న‌రంగ అనే పేరు కోస్తా జిల్లాలలోని బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం నేత‌ను గుర్తుకు తెస్తోంది. ఆయ‌నెవ‌రో స్పెష‌ల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయ‌నే కాపు సామాజిక వ‌ర్గం నేత‌గా బల‌మైన ముద్ర వేసిన వంగ‌వీటి మోహ‌న‌రంగ‌. ఈ సినిమాకి పేరును ఆయ‌న పేరుతోనే పెట్టార‌ని అంటున్నారు.

సాధార‌ణంగా అయితే ఈ సినిమాకి కులం రంగు అంటుకునేది కాదు. కానీ, ప‌వ‌న్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌తో ప‌వ‌న్ ఓ నిర్మాత‌గా నిర్మిస్తోన్న సినిమా కావ‌డంతో దీనికి క్యాస్ట్ క‌ల‌ర్ పూసుకుంది. ప‌వ‌న్‌ను గ‌తంలో కొంద‌రు వంగ‌వీటి మోహ‌న‌రంగతో పోల్చారు. దీనిపై ఆయ‌న సీరియ‌స్ అయ్యాడు. త‌న‌ను కులంతో ముడిపెట్ట‌వ‌ద్ద‌ని క్లాస్ పీకాడు. ఆ త‌ర్వాత కొన్ని అంశాల‌లో ఆయ‌న కాపు సామాజిక వర్గానికి మ‌ద్ద‌తు ఇచ్చాడ‌నే కామెంట్స్ ఉన్నాయి. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్‌కు కాపు వ‌ర్గం స‌పోర్ట్ చేస్తార‌నే విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి. అందులోనూ ఈ సినిమాకి క‌థ‌ను ప‌వ‌న్‌కి అత్యంత స‌న్నిహితుడు అయిన వ్య‌క్తి అందిస్తున్నాడు. దీంతో, మోహ‌న‌రంగ అంటే వంగ‌వీటి అనే కొంద‌రు వివాదంలోకి లాగుతున్నారు. మ‌రి, ఇది కాంట్ర‌వ‌ర్శీకి దారితీస్తుందా…? లేక‌, సైలెంట్‌గా ముగుస్తుందా…? అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Comments

comments