news

పవన్ చెప్పిన సమాధానానికి కత్తి కి పేలింది !

హైదరాబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేసిన ఆయన.. విశాఖ పర్యటనపై కూడా స్పందించారు. ఒకేసారి రెండు పిట్టలంటూ ఎద్దేవా చేశారు.ఇప్పుడు మరోసారి కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు ఎక్కుపెట్టారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ పవన్‌ను కోరారు. త‌న అన్న‌య్య‌ చిరంజీవికి ద్రోహం చేసిన వారిని జనసేన ద్వారా దెబ్బకొడదామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖలో చేసిన వ్యాఖ్యలపై మ‌హేశ్ క‌త్తి విమర్శలు చేశారు.

 

వివాదం పై నోరు విప్పిన పవన్

వాళ్ళలా అయిపోతారంతే

చెప్పాను కదా నేను సినిమాల్లో ఉన్నప్పుడే ఇలాంటి క్యాంపెయిన్ ఉంటుంది. ఎవ్వరికైనా సరే బలమైన గొంతూ వాదనా ఉన్నప్పుడు ఇరిటేట్ అయిపోతారు. వాళ్లకి ఎవరూ ఏమీ చెయ్యక్కర లేదు. వాళ్ళలా అయిపోతారంతే. నేను సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాన్టి వాళ్ళు ఉన్నారు..నేనేమంటానంటే ఇవన్నీ టైమ్ టెస్టింగ్. నన్ను తిట్టేవాళ్ళుంటారు, మెచ్చుకునే వాళ్ళుంటారు, సపోర్ట్ చేసేవాళ్ళూ ఉంటారు, ఇవన్నీ నేను భరించటానికి సిద్దంగా ఉన్నాను. నా పర్సనల్ విషయాల కోసం ట్విటర్ వాడను, నా సినిమాలగురించి నేను ట్వీట్ చేయను, అక్కడికి వచ్చి ఎవరైనా గాయపడతారేమో అని నా సినిమాలకి సంబందించిన ఫంక్షన్లు చేయను.

కానీ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు జనం మధ్యలోకి వేళ్ళాలి ఇబ్బందులుంటాయ్. అందరికీ నచ్చాలనేం లేదు, నచ్చటానికి బంగారాన్ని కాను. నేను మనిషిని వాళ్ళకి నాలో నచ్చే విషయాలుంటాయ్, నచ్చని విషయాలుంటాయ్. అయితే ఎవరు ఎన్ని చేసిన పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉంటారు? నన్ను ద్వేషించి వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారనే అనుకుంటాను.

నన్ను ద్వేషిస్తే వాళ్ళకి ఏం వస్తుందీ, నవ్వటానికి కొన్ని కండరాలు కదిలితే చాలు కానీ ఒకరిని ద్వేషించాలంటే వాళ్ళ బ్లడ్ పొల్యుట్ అవుతుందీ, వాళ్ళ మొహం లో మజిల్స్ దెబ్బ తింటాయ్ నాకిదంతా పడదు. వాళ్ళని వాల్లే పాడు చేసుకుంటున్నారు. నాకదేం పట్టదసలు.. మీరుకూడా అట్లాగే ఉండండి.

చచ్చిపోయేంత సహనం అవసరం లేదు

సహనం ఉండాలి కానీ మనం చచ్చిపోయేంత సహనం అవసరం లేదు. మనం ఎవరి మీద దాడి చేయం కానీ మనలని ఎవరైనా కొడుతుంటూంటే చేతులుకూడా అడ్డు పెట్టకుండా కొట్టమని చెప్తామా? అందుకే మనం చేతులు కట్టుకోని కూచునే పనిలేదు గానీ సేం తైం ఎదురు దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు.అవసరం అయితేనే కనీసం మనల్ని గార్డ్ చేసుకుందామంతే. ఎవరైనా మనలని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఎంతో చూడండి మీకే అర్థమైపోతుంది. అనవసరంగా గోలచేసి ఇలాంటోళ్ళని పెంచి పెద్ద చేయటం తప్ప ఇంకేం లేదు.

నేను పర్పస్ ఫుల్ గా టీవీ చూడను, మిగతా ఇష్యూస్ మీద నా మైండ్ పెట్టటానికిచాలా సెలక్టివ్ గా ఎవర్నైనా అడుగుతాను ఎం జరుగుతుందీ అని..? ఎవరైనా తిడితే మాత్రం నాకు చెప్పకండీ అంటాను. మెచ్చుకున్నారూ అంటే దేశం బాగానే ఉందీ అనుకుంటాను. అలాగే తిట్టేవాళ్ళున్నారంటే భరిస్తాను.

చిరు చేసిందేంటో..?

‘అన్న (చిరంజీవి)ను, పీఆర్‌పీని మోసం చేసినవాళ్ల సంగతి సరే… మరి అన్న గారు జనానికి, కులానికి, పార్టీకి చేసిన మోసం సంగతో..?’ అంటూ మ‌హేశ్ క‌త్తి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.

కొత్త‌ ర‌క్తం, కొత్త‌ త‌ర‌హా రాజకీయాలు కావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మాట‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ‘పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా, ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్త తరహా రాజకీయం’ అంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ, బీజేపీకి ఇక‌ మద్దతు ఇవ్వమ‌ని పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నార‌ని, ‘ఇక మిగిలింది వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్…చలో’ అని మ‌హేశ్‌క‌త్తి అన్నారు. తాను చేసిన ట్వీట్‌ల‌పై ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన మ‌హేశ్‌క‌త్తి.. జ‌న‌సేన కూడా ప్ర‌జారాజ్యం పార్టీలాగే త‌యార‌యింద‌ని విమ‌ర్శించారు.

పవన్  అభిమానులతో సిద్ధం..

విధాన‌ప‌రంగా ప్ర‌జారాజ్యం పార్టీకి, జ‌న‌సేన పార్టీకి తేడా లేద‌ని కత్తి మహేష్ అన్నారు. త‌న‌కి, ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానుల‌కి మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ మొద‌లైతే ఎదుర్కోవ‌డానికి తాను ఎప్ప‌టికీ సిద్ధ‌మేన‌ని అన్నారు. ప‌వ‌న్ అభిమానులు త‌మ తీరును అలాగే కొన‌సాగిస్తారా? లేదంటే మార‌తారా? అన్నది వారి ఇష్ట‌మ‌ని కత్తి మహేష్ చెప్పారు.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment