politics

నేను చంద్రబాబు, జగన్ లాగా కాదు…

అధికారం సాధించటానికి ప్రశ్నించడం అనేది మొదటి మెట్టు, ‘నేను ఐదేళ్లు ఉండి వెళ్ళటానికి రాజకీయాల్లోకి రాలేదు’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియచేశారు. ఈరోజు (10-08-2018) నరసాపురంలో పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ‘‘చంద్రబాబు లాగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి.. జగన్ లాగా.. సీఎంని చేస్తేనే మీ సమస్యలు పరిష్కరిస్తాను.. అని చెప్పటానికి రాలేదు’’, నాకు అధికారాం రాకపోయినా ప్రజలకు అండగా నిలబడటానికి వచ్చానని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి తనకు స్నేహితుడు కాదు.. బంధువు కాదు అని పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ, వైసీపీ దోపిడీలు బరిస్తున్నాం. కానీ జనసేన మాత్రం మీకు అండగా నిలబడేందుకు వచ్చిన పార్టీ అని ఆయన తెలియచేశారు. తాను కులాన్ని నమ్ముకున్న వ్యక్తిని కాదు అని స్పష్టం చేశారు పవన్. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, జగన్ కుటుంబాల మధ్య నలిగిపోతున్నారని, ప్రభుత్వం కాపులకు, బీసీలకు ద్రోహం చేసిందని పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Comments

comments