news

పవన్‌ కల్యాణ్‌కు నాలుగో భార్యగా నేను !

పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. అమ్మాయిల నుంచి అబ్బాయిల వరకు పవన్ అంటే అదొక క్రెజ్.. ఇంకా అమ్మాయిలయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. అప్పుడప్పుడు ఆ ఇష్టం విపిరీతంగా పెరిగిపోయి ఏం చేస్తున్నామో అర్ధంకాని పరిస్థితి వస్తుంది.. అయితే పవన్ కళ్యాణ్ ను అమితంగా ప్రేమించిన ఓ అమ్మాయి గురించి డాక్టర్ చెప్పిన మాటలు ఇవి.. ఒక 5 ఏళ్ళ క్రితం 24 ఏళ్ళ అమ్మాయిని తల్లితండ్రులు నా దగ్గరికి తీసుకొచ్చారు..

విషయానికి వస్తే ఆమె పవన్ కి పెద్ద అభిమాని, పవన్ నన్ను ఇష్టపడుతున్నాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని గోల చేస్తుంటే వాళ్లు నా దగ్గరికి తీసుకొచ్చారు.. ప్రస్తుతం ఆ యువతీ ఓ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగి.. ఒకరోజు పవన్ అక్కడికి వచ్చి నన్ను చూసి నవ్వాడు అంటూ అప్పటినుంచి పవన్ భ్రమలో పడిపోయింది.. ఆ భ్రమ లో వింతవింతగా ప్రవర్తిస్తుంటే చికిత్స అందించాం.. ఆ తర్వాత ఆమె కోలుకొని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో అమెరికాలో ఉంటోంది..

ఆమెకు వచ్చిన జబ్బు పేరు ‘ఎరొటొమేనియా’ మరల ఈ లక్షనాలు తిరగబెట్టే అవకాశం ఉంది.. అల కొన్ని రోజుల తర్వాత ఆమెకు మళ్ళి ఆ వ్యాధి సోకింది.. ఎప్పుడైతే ఈ వ్యాధి తిరగబెట్టిందో ఆమెకు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ గుర్తొస్తాడు. తమాషాగా అనిపించినా ఇది నిజం! ఇప్పుడా అమ్మాయిని భర్త చికిత్స కోసం తీసుకొచ్చాడు. పవన్‌ కల్యాణ్‌కు ముగ్గురు భార్యలున్నా…నాలుగో భార్యగా ఉండటానికి నాకేం అభ్యంతరం లేదంటున్న ఆ అమ్మాయికి ఇప్పుడు చికిత్స నడుస్తోంది..

Comments

comments