news

పీకేను సీఎం చేయ‌డానికి హైప‌ర్ ఆది ఐడియాలు!

నాకు అధికారం మీద మోజు లేదు అంటూ జ‌న‌సేన పార్టీని స్టార్ట్ చేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మ‌ధ్య‌న మాట మార్చి.. ముఖ్య‌మంత్రి పీఠం మీద త‌న‌కున్న ఇష్టాన్ని అప్పుడ‌ప్పుడు చెబుతున్నారు. ఇంత‌కాలం గెలుపుఓట‌ములు ముఖ్యం కాదు.. బ‌రిలో దిగ‌ట‌మే ముఖ్య‌మ‌న్న మాట‌ల్ని వ‌దిలేసి.. మేం గెలిచే మొద‌టి సీటు ఇదేనంటూ ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న వైనం తెలిసిందే.

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌.. త‌న టూర్ కు రంజాన్ సంద‌ర్భంగా వారం పాటు విశ్రాంతిని ఇవ్వ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం కావ‌టానికి.. జ‌న‌సేన అధికార‌పార్టీగా అవ‌త‌రించ‌టానికి ఉన్న అవ‌కాశాలకు సంబంధించి ఒక ఫార్ములాను సిద్ధం చేశారు జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ హైప‌ర్ ఆది.

ముఖ్య‌మంత్రిగా ప‌వ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసేందుకు వీలుగా త‌న ద‌గ్గ‌ర 5 ఐడియాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు. తాను సిద్ధం చేసిన ఫార్ములాను కానీ ఫాలో అయిపోతే ప‌వ‌న్ సీఎం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన జ‌న‌సేన ఐటీ సెల్ స‌మావేశంలో త‌న ఐదుఐడియాల్ని చెప్పుకొచ్చారు.

ఫ‌స్ట్ స్టెప్ క‌మ్ ఐడియా
త‌ర్వాతి సీఎం ఎవ‌రు? అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలి. అందులో అన్ని పార్టీల వారిని గ్రూపుగా ఏర్పాటు చేయాలి. అందులో అంద‌రిని ప్ర‌భావితం చేసేలా జ‌న‌సేన పోస్టులు పెట్టాలి. 8 నెల‌ల త‌ర్వాత అదే గ్రూపును ప‌వ‌న్ క‌ల్యాన్ సీఎం అనే గ్రూపుగా మార్చాలి

రెండో స్టెప్ క‌మ్ ఐడియా

ప‌వ‌న్ అంటే చొక్కాలు చింపుకునే యూత్ అంతా కూడా ఆ ప‌ని కాస్త ప‌క్క‌న పెట్టి.. ప‌వ‌న్ ను తాము ఎందుకంత పిచ్చ‌గా ఆరాధిస్తామో చెప్పాలి. తాము ప‌వ‌న్ మాట‌ల‌కు అంత‌లా స్పందిస్తామ‌న్న విష‌యాన్ని ఇంట్లో వారంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్పాలి. వేరే పార్టీ పెద్ద‌ల‌కు చెప్పే క‌న్నా.. ఇంట్లో వారిని ప్ర‌భావితం చేయాలి.  దీంతో జ‌న‌సేన సిద్ధాంతాలు కుటుంబాల‌కు చేరే వీలుంటుంది.

మూడో స్టెప్ క‌మ్ ఐడియా

గ్రామాల్లో స‌మావేశాలు ఏర్పాటు చేయ‌టం. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మీటింగ్ లు పెట్టే క‌న్నా గ్రామీణ ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డి ప్ర‌జ‌ల‌తో త‌మ పార్టీ సిద్ధాంతాలు.. తాము చేయాల‌నుకుంటున్న కార్య‌క్ర‌మాల మీద అవ‌గాహ‌న తీసుకురావాలి. ఇలా ప్ర‌భావితం చేయ‌టం ద్వారా.. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయొచ్చు.

నాలుగో స్టెప్ క‌మ్ ఐడియా

ఈవెంట్ ఆర్గ‌నైజింగ్ చేప‌ట్టాలి. గ్రామాల్లోని ప్ర‌జ‌ల‌కు జ‌న‌సేన విధానాలు అర్థ‌మ‌య్యేలా ఏయాలి. ఇందుకు త‌గ్గ‌ట్లుగా కొన్ని స్కిట్స్ రూపొందించాలి. ఇంటింటికి వెళ్లే కంటే ఈవెంట్స్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో జ‌న‌సేన త‌త్త్వం మీద అవ‌గాహ‌న క‌ల్పించాలి. ప‌ల్లెల్లోపార్టీపై ఉన్న భావ‌న మారే వీలుంది.

ఐదో స్టెప్ క‌మ్ ఐడియా

అంద‌రిలోనూ న‌మ్మ‌కాన్ని క‌ల్పించ‌టం. అన్నింటి కంటే ఇదే కీల‌క‌మైంది. ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌న్న న‌మ్మ‌కంతో పాటు.. జ‌నంలోకి పార్టీని తీసుకెళ్ల‌టం.. తాను చెబుతున్న ఐదు ఐడియాస్ ను సీరియ‌స్ గా తీసుకొని ప‌ని చేస్తే రానున్న ఎన్నిక‌ల్లో అధికారం జ‌న‌సేన‌దేన‌ని చెబుతున్నాడు.

Comments

comments