politics

తెలుగులో మోడీ ప్రసంగం~ హైదరాబాద్ మహోన్నత నగరం

తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటామన్నారు ప్రధాని మోడీ. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం పోటీతత్వంతో పని చేస్తుందని.. రాజకీయాలు చేయ్యదన్నారు.  బేగంపేట ఎయిర్ పోర్టులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. తెలుగులో మాట్లాడి అందరినీ మురిపించారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ఆయన.. తెలుగులోనే ముగించారు. హైదరాబాద్ కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ అంటే  తనకు సర్దార్ పటేల్ గుర్తుకు వస్తారని అన్నారు. తెలంగాణ విమోచనంలో అమరులైన వీరులకు జోహార్లు పలికారు. హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరమని… నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అభినందనలు అన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఇవాళ అందరి దృష్టి హైదరాబాద్ పై ఉందని… గ్లోబల్ సమ్మిట్ కోసం ఎంతో మంది దేశవిదేశీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చారన్నారు.

బీజేపీ కార్యకర్తలు చేస్తున్న త్యాగం… భారత మాత సేవకోసం.. సమాజ కోసం చేస్తున్న వారు చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని… దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో అధికారంలో లేకపోయినా.. సమాజం కోసం అపూర్వ త్యాగాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమని.. తెలంగాణ ప్రజలపై విశ్వాసం ఉందని.. రాష్ట్రంలో ఎవరున్నా.. తమ సహకారం అందుతూనే ఉంటుందన్నారుహైదరాబాద్ ఓ మహోన్నతమైన నగరమని, హైదరాబాద్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉందని మోదీ అన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

రాజనీతి ఆధారంగా భేదాలు ఉండవుని ప్రధాని మోడీ అన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. రాష్ర్టాల వికాసం కోసం, వాటి అభివృద్ధి కోసం, భారత ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ వికాసం కోసం భారత సర్కార్ ఎటువంటి లోటు రానివ్వదని మోడీ అన్నారు. తెలంగాణ ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికాస్ యాత్రకు కేంద్ర సర్కార్ తోడుగా ఉంటుందని, తెలంగాణ సౌభాగ్యాన్ని మార్చేస్తామని ప్రధాని అన్నారు.

తనకు స్వాగతం పలికిన ప్రతి బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. భారతమాత సేవ కోసం తెలంగాణ బీజేపీ పరిశ్రమించిందన్నారు. దాని వల్లే బీజేపీ, దేశంలో పెద్ద పార్టీగా అవిర్భవించిందన్నారు. బీజేపీ కార్యకర్తలకు ఈ లాభం వెళ్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ ఓ అద్భుతమైన నగరమన్నారు. మరికాసేపట్లో మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభిస్తారు.

Comments

comments