news

మోడీ వల్ల వారి భార్య ఇప్పటికి ఎలాంటి భాధలు అనుభవిస్తుందో తెలుసా …!

ప్రధాని భార్యకు భద్రత తొలగించండి’

1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. 1970లలో విశ్వ హిందూ పరిషత్తులో చేరారు. గుజరాత్‌లోని ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన జీవితం అనేక మలుపులు తిరిగింది. శాసనమండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.

ప్రధాని మోదీ భార్య యశోదబెన్‌కు జెడ్‌ కేటగిరీ భద్రతను తొలగించి ఆమెకు స్వేచ్ఛనివ్వాలి. లేకుంటే ఆమెను భార్యగా అంగీకరించాలి్ణ అని డిమాండ్‌ చేస్తూ అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ పాలెపు సుశీల ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. మియాపూర్‌లోని న్యూహఫీజ్‌పేటలో క్లినిక్‌ నడుపుతున్న ఈమె మీడియాతో మాట్లాడుతూ యశోదబెన్‌తో తన పెళ్లి చెల్లదని మోదీ అన్నపుడు.. ఆమెకు జెడ్‌ కేటగిరీ భద్రత ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఈ విషయమై మోదీ స్పందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. కాగా తనకు ఏ హోదాతో భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నారో తెలపాలంటూ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. భద్రతతో పాటు ప్రధాని భార్యకు ప్రోటోకాల్ ప్రకారం ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా, తన భద్రతా సిబ్బంది అధికార వాహనాలు వాడుతుండటం విచిత్రంగా ఉందని వాపోయారు. అలాగే గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ తన పాస్‌పోర్ట్‌లో భార్యకు సంబంధించి ఎటువంటి వివరాలు పొందుపరిచారో తెలపాలంటూ జశోదా బెన్‌ ఆర్టీఐ అధికారులను కోరారు.

Comments

comments