movies

ప్రభాస్ నో అనేసాడు..

బాహుబలి రాకపోయి ఉంటే ప్రభాస్  కెరీర్ ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా అభిమానులు ఇష్టపడటం లేదు. అంతలా ప్రభావం చూపించింది ఆ సినిమా. జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ డిమాండ్ మామూలుగా లేదు. మిర్చి టైంలో తీసుకున్న రెమ్యునరేషన్ కి ఐదింతలు పైగా పెరిగిందని అనఫీశియల్ టాక్ చాలా రోజుల నుంచే ఉంది.

బాహుబలి రెండు భాగాలు హిందిలో మార్కెట్ చేసిన దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రభాస్ తో బాలీవుడ్ ఎంట్రీ చేయించేందుకు ముందు నుంచి ఉత్సాహంగా ఉన్నాడు. గతంలో ఒకసారి ప్రతిపాదన చేసినప్పటికీ 20 కోట్ల దాకా ప్రభాస్ డిమాండ్ చేయటంతో కరణ్ సైలెంట్ అయ్యాడని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. అవి నిజమో కాదో ఇటు హీరో కాని అటు కరణ్ గాని ఏమి మాట్లాడలేదు. తాజాగా మరోసారి ప్రభాస్ ను కలిసాడట కరణ్.

పారితోషికం ఎంతైనా సరే ఈసారి బాలీవుడ్ డెబ్యు చేద్దామని కరణ్ జోహార్ అడిగినా ప్రభాస్ సున్నితంగా తిరస్కరించినట్టు టాక్. ఇప్పుడు చేస్తున్న సాహో పూర్తి కావడానికి మరో పది నెలల దాకా టైం పడుతున్న నేపధ్యంలో జిల్ దర్శకుడు రాధాకృష్ణతో ప్రభాస్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో అనవసరంగా రిస్క్ తీసుకుని హిందీ సినిమాల వైపు వెళ్లి ఇక్కడి ఆఫర్స్ ని పోగొట్టుకోవడం ఎందుకని వద్దని చెప్పినట్టు తెలిసింది. పెదనాన్న కృష్ణంరాజు సైతం బాలీవుడ్ ఆఫర్స్ కి టెంప్ట్ కావద్దని వారించినట్టు సమాచారం.

ఇక్కడ మరో విషయాన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. తెలుగు స్టార్ హీరోలు హింది లో చేసిన స్ట్రెయిట్ సినిమా ఏది ఇంతవరకు వర్క్ అవుట్ కాలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ అందరూ అక్కడ ప్రయత్నించి ఫెయిల్ అయిన వాళ్ళే. బాహుబలి డబ్బింగ్ సినిమా కాబట్టి ప్రభాస్ కు ఈ సెంటిమెంట్ వర్తించలేదు. అందుకే బాలీవుడ్ ఎంట్రీకి తొందరపడకుండా సాహో తో పాటు రాదాకృష్ణ సినిమా పూర్తి చేయటం గురించి దృష్టి పెట్టాడు ప్రభాస్.

Comments

comments