movies

కొణిదెల కుటుంబానికి అల్లుడు కానున్న ప్రభాస్!! క్లారిటీ ఇచ్చిన క్రిష్ణం రాజు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ‘బాహుబలి’ ఒక్క సినిమాతోనే దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రధాని మోఢీ సైతం స్వయంగా పిలిపించుకుని మరీ అభినందించారు. ఇక బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఈ స్టార్ మరోసారి తన పెళ్లి వాయిదా వేసుకుని నెక్ట్స్ మూవీ ‘సాహో’ షూటింగులో బిజీ అయిపోయారు. ప్రభాస్ లేదా ఆయన కుటుంబ సభ్యులు మీడియా కంటపడితే పెళ్లి గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. పెద్దనాన్న కృష్ణంరాజు అయితే ప్రభాస్ ఊం అనేయాలి కాని రోజుల్లోనే పెళ్లి చేసేస్తానని మీడియా ముందు తేల్చేశారు.

ప్రభాస్ ఇక అనుష్క ను పెళ్లి చేసుకుంటాడని వార్తలు కోకొల్లలు వచ్చాయి. బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు అయితే వారి పెళ్లి కన్ఫర్మ్ అని సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టేశారు. తెరమీద మంచి ‘ఈడూ జోడు’తో కనిపించే వీరు తెరవెనుక కూడా ఒకటైతే బాగుంటుందని అభిమానుల కోరిక. ఇదిలా ఉండగా ప్రభాస్ కోసం సంబంధాలు చూస్తున్నామని, తమకు నచ్చిన కొన్ని సంబంధాలను షార్ట్ లిస్ట్ చేశామని కృష్ణం రాజు తెలిపారు. అయితే ప్రభాస్ నుండి పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. పెళ్లి గురించి అడిగినప్పుడల్లా నా పెళ్లికి ఇంకా సమయం ఉందంటూ తప్పించుకుంటున్నాడట ఈ బాహుబలి స్టార్.

ఐతే ఇదే సమయంలోనే ప్రభాస్ పెళ్లి గురించి తాజాగా ఓ వార్త సంచలనం రేపుతోంది. కృష్ణం రాజు చూసిన షార్ట్ లిస్ట్ లో మెగా ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక ప్రభాస్ కూడా ఈ సంబందం విషయంలో తన వద్దకు వచ్చిన ప్రతిపాధనను ఆలోచన చేస్తున్నారట.. అదే జరిగితే అనుష్క, ప్రభాస్ ల పెళ్లి ఒట్టి పుకారే అని అనుకోవాల్సి వస్తుంది. అయినా కొణిదెల ఫ్యామిలీ కాని, కృష్ణం రాజు ఫ్యామిలీ కాని ఈ విషయంలో డెసిషన్ వచ్చినట్లు కూడా ఎక్కడా అధికారికంగా మాట్లాడింది కూడా లేదు.

అయితే అదే జరిగితే ప్రభాస్ మెగా వారి ఇంటికి అల్లుడు అవుతున్నందుకు ఇటు ప్రభాస్ అభిమానులు, అటు మెగా అభిమానులు కూడా పండగ చేసుకునే అవకాశాలున్నాయి.. సమంత-నాగచైతన్యల పెళ్లి తర్వాత దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల అభిమానులు, సమంత అభిమానులు కలిసి పండుగ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ కి చెందిన ఈ కొత్త గాసిప్ కూడా ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.. ఈ ఊహాగానం గనుక నిజమయితే ఇటు సినిమాల పరంగా అటు రాజకీయాల పరంగా కూడా బాగా కలిసివస్తుందని రెండు ఫ్యామిలీలు అంచనాలో ఉండే అవకాశాలయితే లేకపోలేదు.

Comments

comments