news

తాగి వాహనం ఎందుకు నడిపాడో ప్రదీప్ ఏమని చెప్పాడో తెలుసా?

పోలీసులు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని చెబుతున్నా పెడచెవిన పెట్టిన ప్రదీప్ కు తగిన శాస్తి జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ సుద్దులు చెప్పిన సెలబ్రిటీయే అడ్డంగా దొరికి పోవడం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం అసలే కఠిన నిబంధనలు అంటోంది… అసలేం జరగబోతోంది… జనవరి 1 తెల్లవారుఝామున యాంకర్ ప్రదీప్ పట్టుబడినప్పటి నుంచి తెలుగు ప్రజల్లో ఎక్కడలేని యాంగ్జయిటీ నెలకొంది. ఎట్టకేలకు 19 రోజుల తర్వాత ఈ కేసుకు నాంపల్లి కోర్టు ఓ ముగింపు పలికింది. ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్సును మూడేళ్ల పాటు రద్దు చేసి.. నిబంధనల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ప్రదీప్ కే కాదు ప్రజలందరికీ తెలిసేలా చేసింది.

న్యూ ఇయర్ వేడుకల్లో తప్పతాగి కారు నడుపుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన యాంకర్ ప్రదీప్, ఇవాళ కేసు విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. కోర్టులో ఆరోజు ఎందుకు తాను తాగి నడపాల్సి వచ్చిందో సంజాయిషీ ఇచ్చుకున్నాడు ప్రదీప్. మీరు ఒక బాధ్యతాయుతమైన సెలబ్రిటీ అయి ఉండి, ఎందుకు తాగి వాహనాన్ని నడపాల్సి వచ్చింది అంటూ న్యాయమూర్తి తనను అడిగిన ప్రశ్నకు ప్రదీప్ తన సమాధానం ఇచ్చాడు.

అందర్నీ చట్టాన్ని, రూల్స్ ను ఫాలో అవ్వమని చెప్పడం తనకు అలవాటని, తాను తాగి వాహనం నడపడం తప్పే అని అంగీకరించిన ప్రదీప్, తన కారు డ్రైవర్ కొన్ని కారణాల వల్ల రాకపోవడంతో, వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో తానే కారు నడుపుకుంటూ రావాల్సి వచ్చిందని, మరోసారి ఇలాంటి తప్పు చేయనని ప్రదీప్ అభ్యర్ధించాడు. ప్రదీప్ వాదనలు విన్న కోర్టు, అతని అభ్యర్ధనను మన్నించి, చాలా చిన్న శిక్షతో సరిపెట్టింది. ప్రదీప్ కు రూ. 2100 జరిమానాతో పాటు, మూడేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసింది. అయితే హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ పోలీసుల సరికొత్త నిబంధనల ప్రకారం ప్రదీప్ కు కనీసం వారం రోజులకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు. కాని కోర్టు అంతకంటే పెద్ద శిక్షే వేసింది. ఏకంగా మూడేళ్ల పాటు స్టీరింగ్ మీద చెయ్యి వేయకుండా చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి శిక్షలు చాలా చాలా అరుదని విశ్లేషకులు చెబుతున్నారు.

Comments

comments