health

గర్భధారణ సమయంలో అధిక రక్తపోటును నియంత్రించడం ఎట్లా?

మీ ముందు రకరకాల సమస్యలు ఉన్నాయి! వాటిని పరిష్కరించుకోవడానికి నలుగురు ద్వారా మీరు వింటున్న రాకరకాల సలహాలు, సూచనలను దృష్టిలో పెట్టుకుని, వాటిని ఆచరిస్తూ, అవలంబిస్తూ నిదానంగా ఉండటమనేది చాల కష్టమైన పని. మీరు కష్టబడి మీ స్వేదాన్ని చిందిస్తూ ఎలా ఆరోగ్యంగా ఉండాలో అని ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని మీ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

అంతగా అయోమయానికి లోనుకాకండి. ఒక్కోసారి మీ రక్తపోటు అమాంతంగా అధికమవ్వడానికి రకరకాల కారణాలుంటాయి. మీ శరీరబరువు, పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు, మీ వయస్సు లేదా మీ గర్భంలో ఒకరిక ఎక్కువమంది పిల్లల్ని మోయడం మొదలైనవి. కారణం ఏదేమి ఐనప్పటికిని, కొన్ని ప్రభావవంతమైన మార్గాల ద్వారా మీ రక్తపోటు నియంత్రించుకోవచ్చు.

వ్యాయామం:

మీ రక్తపోటును అదుపులో ఉంచాలంటే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ కొంతదూరం నడవటమో, లేదా యోగా వంటివి చేయడమో అలవాటు చేసుకోండి.. ఇలా చేయడం వలన మీ గుండెకు సంబంధించిన కండరాలు బలంగా తయారయ్యి రక్తప్రసరణ పెరుగుతుంది.

శరీర బరువు:

మీ రక్తపోటును నియంత్రించే అంశాలలో మీ శరీర బరువు ఒకటి. కనుక అధికంగా బరువు పెరగకుండా జాగ్రత్త పడండి. మీరు ఆరోగ్యంగా ఉంటె మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఊబకాయం వలన తీవ్రమైన తలనొప్పి మాత్రమే కాక ఇంకా క్లిష్టమైన ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు ఉత్పన్నమయ్యి గర్భిణులలో ప్రసవం ఆలస్యమవ్వడం, నొప్పి నివారణ మాత్రలు పనిచేయకపోవడం వంటివి జరుగుతాయి.

ఉప్పు వాడకం:

మీ దైనందిన ఉప్పు వినియోగాన్ని 15౦౦ మిల్లీ గ్రాములకు కుదించుకోండి. ఇంకో విషయమేమిటంటే , మీరెంత ఉప్పును ప్రతిరోజూ వినియోగిస్తున్నారో అంచనా వేసుకోండి. అప్పుడు సహజంగానే మీ రక్తపోటులో అనుకూలమైన మార్పులు గమనించవచ్చు. వేపుడు పదార్థాలు తినకండి. బయట ఆహరం మరియు స్పోర్ట్స్ డ్రింకులు సేవించకండి.

తక్కువ కొవ్వు కలిగిన పాలు తాగండి:

కాల్షియం,మెగ్నీషియం మరియు పొటాషియం యొక్క ఆవశ్యకత మీకు అధికంగా ఉంటుంది. ఇవి మీ రక్తపోటు సమస్యను మాయం చేస్తాయి. కొవ్వులేని పాల పదార్ధాలతో పాటు నారింజ రసం, హేజల్ నట్లు మరియు గోధుమ తవుడు తీసుకోండి. మీరు ఉత్తి పాలను తాగడం ఇష్టపడనట్లయితే, స్ట్రా బెర్రీలు, వొయిలా వంటి పండ్లతో కలిపి మిల్క్ షేక్ తయారుచేసుకుని తాగండి.

రోజుకు ౩ లీటర్ల నీరు తాగండి.

మీ శరీరానికి అవసరమైన నీటిని అందివ్వడం తప్పనిసరి. రోజుకు ౩ లీటర్ల నీరు తాగండి. కార్బనేటెడ్ పానీయాలు ఆరోగ్యానికి మంచివి కావు. వాటిని తాగరాదు.

తగినంతగా నిద్రపోండి.

వికారంగా అనిపించినప్పుడు చిన్న కునుకు తీయండి.

మీ ఆహారంలో కొత్తగా ఒమేగా ౩ కొవ్వు ఆమ్లాలకు చోటు ఇవ్వండి.

మీ ఆహారంలో కొత్తగా ఒమేగా ౩ కొవ్వు ఆమ్లాలకు చోటు ఇవ్వండి. ఇవి మీ రక్తపోటు స్థాయిని నియంత్రించి, ట్రైగ్లిసరైడ్స్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

Comments

comments