news

భర్తలు లేకుండా గర్భవతులు అయినా భార్యలు !!

పలానా చోట ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగింది, పలానా చోట గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది.. మరో చోట మరోరకం స్మగ్లింగ్… ఇలా స్మగ్లింగ్ సంబంధించి అనేక వార్తలు మనం నిత్యం పేపర్లలో టీవీల్లో చూస్తూనే ఉంటాం… డబ్బుకోసమ అడ్డ దారుల్లో స్మగ్లింగ్ చేసి పైకి రావాలని దొంగలు, దళారులు ఇలా చేస్తుంటారు… ఇది మామూలే కానీ వీర్యం స్మగ్లింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? అవునండీ మీరు విన్నది నిజమే… అది కూడా మొట్టమొదటి సారిగా వీర్యాన్ని స్మగ్లింగ్ చేసిన మహిళగా పేరు కూడా సంపాదించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

భర్త జైల్లో ఉన్నాడు. ఇలా ఏళ్లకు ఏళ్లు దొర్లిపోయాయి. కానీ ఒకరోజు ఆమె గర్భం దాల్చింది. పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది. భర్త జైల్లో ఉంటే భార్య ఎలా తల్లి అయ్యింది? ఆవేశపడి ఆమె శీలాన్ని మాత్రం శంకించకండి దయచేసి… ఆమె తన భర్త వీర్యాన్ని స్మగ్లింగ్‌ చేసింది.. పాపం అలా చేయడం మినహా మరో మార్గం కూడా లేదు ఆమెకు.

ఎందుకంటే ఇజ్రాయిల్‌ జైళ్లలో ఇరవై ఏళ్లుగా మగ్గిపోతున్న భర్తల నుంచి వీర్యం సంపాదించి.. ఐవీఎఫ్‌ విధానంలో పాలస్తీనా మహిళలు తల్లులవుతున్నారు.నా భర్తను ఈ బిడ్డలో చూసుకుంటూ జాగ్రత్తగా పెంచుతాను. నా జీవితంలో ఇంతకంటే సంతోషం మరొకటి లేదు అంటూ… ఇజ్రాయిల్‌ జైల్లో 22 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ఫాహ్మీ సలాహ్‌ భార్య పొంగిపోయింది.

ఫాహ్మీ వీర్యాన్ని గాజాలోని క్లినిక్‌కి చేరవేయడంతో.. ఐవిఎఫ్‌ ద్వారా అతని భార్య గర్భం దాల్చింది. నిజానికి 2004లో రాహి ముష్‌తాహా అనే పాలస్తీనా ఖైదీకి మొట్ట మొదట ఈ వీర్యం స్మగ్లింగ్‌ ఐడియా వచ్చింది. మొదట్లో ఆయన కుటుంబ సభ్యులే ఒప్పుకోలేదు.

కానీ తన భార్యకు లేఖ పంపాడు. మనం మౌనంగా ఉంటే రేపు దేశం కోసం ఎవరు నిలబడతారు? ఎవరు పోరాడుతారు? అంటూ ఆమెను ఒప్పించాడు. ఆ తర్వాత వీర్యం స్మగ్లింగ్‌ ఐడియాను మిగతా ఖైదీలు కూడా ఫాలో అయ్యారు. జైలు అధికారుల కంటపడకుండా తమను చూడటానికి వచ్చిన కుటుంబ సభ్యుల ద్వారా వీర్యం శాంపిల్‌ బయట పంపడం మొదలుపెట్టారు.

గత మూడేళ్లలో పాలస్తీనా ఖైదీల భార్యలకు 32మంది పిల్లలు పుట్టారు. అదండీ సంగతీ… కలికాలం.. వాళ్ళు మాత్రం ఏం చేయగలరని అంటున్నారు నెటిజన్లు…

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment