news

అమ్మాయిలను ఆత్మ గర్భవతులను చేసిందట!!

కొన్ని ఘటనల గురించి చెబితే చాలా చాలా కష్టం. ఎందుకంటే అవి బేస్ లెస్ గానూ, నమ్మలేనంత డ్రమటిక్‌గానూ ఉంటాయి. కాని అవి నిజంగా జరిగాయని ఆ ఘటనకు బాధ్యులు, బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటారు. కాని అవి ఏమాత్రం నమ్మశక్యంగా ఉండవు. అయినా సరే ఏళ్ల తరబడి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. జనం నమ్మినా, నమ్మకున్నా వాటిని మాత్రం తెలుసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు చెప్పబోతున్న విషయం కూడా దాదాపు 80 సంవత్సరాల క్రితం జరిగింది. గ్రీస్‌ దేశంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సోషల్‌ మీడియా లేకపోవడం వల్ల పెద్దగా ప్రచారం కాలేదు కాని, ఒక రచయిత రాసిన యదార్థ సంఘటనల పుస్తకం అంటూ బహిర్గతపర్చడం ద్వారా ఇప్పుడు బయటకు వచ్చింది.

ఒక పోలీస్‌ స్టేషన్‌కు రాత్రి ఏడు గంటల సమయంలో స్టెల్లా అనే మహిళ వెళ్లి తన ప్రియుడు నెల రోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదిచ్చింది. మూడు నెలల క్రితం పరిచయం అయిన స్టీవెన్‌ హంగ్‌ ఆర్మీలో జాబ్‌ చేస్తుంటాడని, తమ పరిచయం ప్రేమగా మారి, శరీరకంగా కూడా కలుసుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది.

ఆ పోలీస్‌కు అతడు ఆమెను మోసం చేసి వెళ్లిపోయాడని అర్థమయ్యింది. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా ఈ అమ్మాయిలు మాత్రం జాగ్రత్తగా ఉండరు కదా అని మనస్సులో అనుకుని, సరే అతడి వివరాలు ఇవ్వడం, అలాగే అతడి ఫొటోగ్రాఫ్‌ ఏమైనా ఉంటే ఇవ్వండి మేము అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాం అన్నాడు.

ఆ సమయంలో అతడి గురించి స్టెల్లా తనకు తెలిసిన విషయాలన్నింటినీ చెప్పేసింది. అలాగే తన వద్ద ఉన్న ఫొటోలను ఇచ్చింది. అయితే ఆ ఫొటోలను చూసి నివ్వెర పోయిన సదరు పోలీస్‌ ఏంటి ఈ ఫొటోల్లో అతడి మొహం లేదు. కేవలం షాడో మాత్రమే ఉందే అన్నాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ ఫొటోలు ఉన్నట్లుండి ఎందుకు అలా అయ్యాయి అని ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. షాక్‌లోంచి తేరుకున్న సదరు పోలీసు ఎంక్వౌరీ చేస్తామంటూ చెప్పి ఆమెను పంపించాడు. ఆ తర్వాత అతడి వివరాలతో ఆర్మీ ఆఫీస్‌లో ఎంక్వయిరీ చేశాడు. అలాంటి పేరుతో ఆర్మీలో ఎవరూ లేరు అని చెప్పగానే ఆ పోలీస్‌కు విషయం అర్థమయ్యింది.

ఆమెను మోసం చేసి వెళ్లి పోయాడు. ఎటు తేలకపోవడంతో ఆ కేసును పక్కకు పెట్టేశారు. సరిగ్గా నాలుగు నెలల తర్వాత మరో యువతి తాను మోసపోయాను అంటూ అచ్చు స్టెల్లా చెప్పిన వివరాలను చెప్పింది. ఈసారి ఈమె రెండు నెలల గర్బవతి కూడా… అదే విధంగా ఫొటోల్లో షాడో మాత్రమే ఉంది. ఇలా అయిదురుగు యువతులు పోలీసులకు వేరు వేరు చోట్ల ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మిస్ట్రరీని ఛేదించేందుకు ఒక పోలీస్‌ టీంనే ఎంపిక చేశారు. అప్పుడు ఆ టీం చాలా లోతుగా అధ్యయనం చేసి అతడు రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన రాబర్ట్‌గా గుర్తించారు. కనిపించిన ప్రతి అమ్మాయిపై కోరికను వ్యక్తం చేసే రాబర్ట్‌ వీలైతే లొంగదీసుకోవడం లేదా రేప్‌ చేయడం చేసేవాడు.

ఎంతో మంది రాబర్ట్‌ చేతుల్లో నలిగిపోయారు. అలాంటి రాబర్ట్‌ ఒకరోజు ప్రమాదవశాత్తు చనిపోయాడు. చనిపోయిన రాబర్ట్‌ కోరికలు తీరకపోవడంతో ఆత్మగా మారాడు. ఆత్మగా మారిన రాబర్ట్‌ ఏదో ఒక వ్యక్తిలో చేరి ఆడవారిని తన ప్రతిభతో వలలో వేసుకోవడం మొదలు పెట్టాడు.ఒక్కో యువతితో ఒక్కో శరీరంతో వెళ్లేవాడు. ఫిర్యాదు చేసిన అయిదుగురు మాత్రమే కాదు, ఇంకా చాలా మందినే రాబర్ట్‌ ఆత్మ శారీరకంగా లొంగ తీసుకుంది. విషయం తెలిసిన పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. ఇంకా ఎన్ని ఇలాంటివి జరుగుతాయో అని ఆందోళన చెందిన పోలీసులకు ఆ తర్వాత కేసులు ఏమీ నమోదు కాలేదు. కొన్ని సంవత్సరాల వరకు ఆ విషయం చర్చ జరిగింది. ఆ తర్వాత అంతా మర్చిపోయారు. తాజాగా ఆ విషయం ఒక రచయిత వెలుగులోకి తీసుకొచ్చాడు.

Comments

comments