news

ప్రియా వారియ‌ర్ బాయ్ ఫ్రెండ్ ఇత‌నే ఎవ‌రో తెలిస్తే..షాక్ అవుతారు.

ప్రియా ప్రకాష్ వారియార్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒకటే చర్చ. అందరి పోస్టుల్లో ఒకటే ఫోటో. అసలు ఎలా మొదలైందో తెలియదు, ఎవరు ఫస్ట్ పోస్ట్ చేసారో గుర్తు లేదు.సునామి లాగా అందరి మొబైల్ ఫోన్స్ వాల్ పేపర్స్ ఆక్రమించుకుంది కేరళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. గత మూడు రోజులుగా ఆమె నామస్మరణతో యూత్ ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్ లు మోతెక్కిపోతున్నాయి.

ప్రేమికుల రోజు ముందు వాలంటైన్స్ డే వీక్ నడుస్తుండగా కాస్త డిఫరెంట్ గా కానికొట్టి, ఐ బ్లింక్ చేసి దేశంలోని కుర్రకారు మనసుని దోచుకుంది ఈ మలయాళీ కుట్టి. ఆ వీడియో విడుదలైనప్పటి నుండి దేశంలో ఇంతకు మించిన హాట్ టాపిక్ లేదంటే అతిశయోక్తి లేదు. ఆఖరికి నేషనల్ న్యూస్ ఛానెల్స్ లో కూడా ఆమె వార్తలే. తెలుగు న్యూస్ ఛానెల్స్ అయితే స్పెషల్ బుల్ టెన్స్ వేస్తున్నారు. ఆఖరికి అల్లు అర్జున్ కూడా ఆమెకు ఫిదా అయిపోయాడు.

ప్రస్తుతం ఆమెకు ఉన్న పాపులారిటీ స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గదని చెప్పుకోవచ్చు. చివరకు ఆమె ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిన వరల్డ్ ఫేమస్ ఫిగర్స్ లో ప్రియాది మూడో స్థానం. ఇండియాలో అయితే ఈమె టాప్. ఇకపోతే, ఆమె కలల్లో మునిగి తేలుతున్న కుర్రాళ్లకు పెద్ద షాక్ ఇచ్చిందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అందులో నిజమెంతో తెలియదు కానీ, ఆమెకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. చివరకు అతగాడు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడట. అది ఏంటంటే..

ఫైనల్ గా ప్రియా ను గెలుచుకుంది నేనే అని ఒకింత గర్వంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడట. ఆ పోస్ట్ ఇప్పుడు ట్రోల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో నిజానిజాలతో సంబంధం లేకుండా అనేక ట్రెండింగ్స్ అవుతుంటాయి. అందులో ఇదికటి కావచ్చు.. కాకపోవచ్చు.. కానీ, ఆమె కలల్లో మునిగితేలుతున్న కుర్రాళ్ళు మాత్రం పోస్ట్ కి సంబంధించిన ఇమేజ్ చూసి తెగ ఫీల్ అయిపోతున్నారు అట. దాని మీద కూడా సెటైర్లు వేస్తూ ట్రోల్ల్స్ నడుస్తున్నాయి. ఇంస్టాగ్రామ్లో ఓ వ్యక్తి తన సోల్ మేట్ అంటూ పోస్ట్ చేసినట్లుగా.. అలాగే ప్రియా వారియర్ తో చనువుగా ఉన్నట్లుగా దిగిన ఫోటోలు పెట్టేసరికి అది చూసిన కుర్రాలందరు పాపం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

 

Comments

comments

Recent Posts