movies

మార్కెట్’లోకి ‘PSPK25’ సెల్ ఫోన్స్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుతో సెల్ ఫోన్ లు వ‌చ్చేస్తున్నాయి. సెల్ కాన్ కంపెనీ ‘PSPK25’ పేరుతో ఈ ఫోన్ ల‌ను విడుద‌ల చేయ‌నుంది. త్వ‌ర‌లోనే 50వేల యూనిట్స్ మొబైల్ ఫోన్స్ మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టు సమాచారమ్. ఈ మేర‌కు సెల్ కాన్ కంపెనీ ఇప్పటికే అజ్ఝాతవాసి చిత్రబృందంతో చర్చలు జరిపిందని చెబుతున్నారు. ఇందుకు పవన్ కూడా ఓకే చెప్పినట్టు చెబుతున్నారు.

ఇక, నాలుగు రోజుల షూటింగ్ మినహా ‘అజ్ఝాతవాసి’ షూటింగ్ పూర్తయ్యింది. మరోవైపు, పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Comments

comments