politics

రజినీకాంత్ బయపడుతున్నారా ..! పార్టీ గుర్తులో కమలం తొలగించం పై రజినీ లో ఆందోళన …!

‘‘నేను రాజకీయాల్లోకి వస్తున్నా. సొంతంగా పార్టీ పెడతా. రాబోయే శాసనసభ ఎన్నికల్లో 234 స్థానాల్లో నా పార్టీ పోటీ చేస్తుంది’’ అని తమిళ సినీ నటుడు రజనీకాంత్ ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా రజనీ రాజకీయ ప్రవేశంపై ఉన్న ఉత్కంఠకు ఆయన 2017వ సంవత్సరం చివరి రోజున తెరదించారు.అయితే కాషాయ పార్టీతో అంట కాగితే భవిష్యత్తులో అది తనకు చేటు తెస్తుందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ భయపడుతున్నారా?.. ఆ పార్టీతో ఇప్పటికి కొంతదూరం పాటించడం మంచిదని యోచిస్తున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు.

ఇందులో భాగంగానే తను విశ్వసించే బాబా గుర్తులో ఉన్న తామరపువ్వును ఆయన ఆకస్మికంగా తొలగించారని చెబుతున్నారు. హిమాలయాల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్నారని విశ్వసించే తన ఆధ్యాత్మిక గురువు బాబాజీ చూపే ముద్రతో, అభిమానులతో రజనీ ఫోటో సెషన్స్‌లో పాల్గొన్నప్పుడు, వేదిక వెనుక భాగంలో.. బ్యానర్‌ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. కుడిచేతి చూపుడు వేలిని, చిటికెన వేలిని పైకెత్తి తక్కిన మూడు వేళ్లను ముడిచివుంచే ఆ ముద్రను ‘ఆబాణ ముద్ర’ అని పిలుస్తారు.అయితే ఆ చేతి ముద్ర దిగువన తామరపువ్వు ఉండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజేపీతో కలవడం ఖాయమైనందునే ఆయన ఆబాణ ముద్ర కింద తామరపువ్వును పెట్టారంటూ అభిమానులు సైతం పెదవి విరిచారు.

దీంతో ఖంగుతిన్న రజనీ.. బాబా ముద్ర దిగువనున్న తామరను తొలగించి ఆ ముద్ర దిగువన ‘సత్యం, శ్రమ, ఉన్నతం’ అంటూ తమిళ నినాదం పొందుపరిచారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో మలేషియాలో ఈ నెల 6న నిర్వహించనున్న స్టార్‌ నైట్‌లో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ భేటీ కానున్నారు.

రజనీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించించిన నేపథ్యంలో వీరిద్దరూ కలుసుకోనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, రజనీకాంత్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.360 కోట్లు అని పిన్‌ ఆఫ్‌ సంస్థ వెల్లడించింది. ఇక తను ప్రారంభించబోయే పార్టీ జెండా రూపకల్పన పనులు జరుగుతున్నాయని, జెండా పరిచయ కార్యక్రమంలో మీడియాతో సమావేశమవుతానని తెలిపారు.

Comments

comments

Recent Posts