movies

రామ్ చరణ్ అనసూయ మధ్య రిలేషన్ ఏంటో !?

తెలుగునాట బుల్లితెరపై యాంకర్స్ గ్లామర్ ట్రీట్ అవడం అనేది ‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయతోనే మొదలైందని టాలీవుడ్‎లో ఓ టాక్ ఉంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కొత్త భామలు సైతం బుల్లితెరపై పొట్టిదుస్తులతో వయ్యారాల వడ్డిస్తున్నారు. అయితే వీరందరి టార్గెట్ సిల్వర్ స్క్రీన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ ప్రారంభంలో పవన్ వంటి స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‎కు నో చెప్పిన అనసూయ ఆ తర్వాత అదే తరహా పాత్రల్లో నటిస్తుండటం విశేషం…

‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’, ‘విన్నర్’ వంటి సినిమాల్లో మెరసిన అనసూయ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’లో నటిస్తోంది. ఆల్రెడీ చరణ్, సమంత క్యారెక్టర్స్‎కు సంబంధించిన ఫొటోస్ వచ్చేయడంతో ఇప్పుడు అందరిచూపు అనసూయ రోల్‎పై పడింది.

ఈ సినిమాలో అనసూయ క్యారెక్టర్ ఏమిటనే విషయంపై ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో అమ్మడి క్యారెక్టర్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‎డేట్ లీక్ అయింది.

రామ్‎ చరణ్‎కు మేనత్త పాత్రలో నటిస్తోందట అనసూయ. అత్త పాత్ర అనగానే సీనియర్ యాక్ట్రెస్‎లా తెల్లజుట్టుతో కనిపించే ముసలి క్యారెక్టర్ అనుకోవాల్సిన పనిలేకపోవచ్చు. ఒకవేళ చరణ్ పాత్ర చిన్నప్పటి సీన్స్‎లో అత్తగా కనిపిస్తోందేమో. ఈ అత్తకు జంటగా కనిపించే మామ జగపతిబాబు అనే ఊహాగానాలు ఉన్నప్పటికీ అసలు విషయం మాత్రం బయటకు పొక్కడం లేదు.

ఏదేమైనా ఈ సినిమాకు సంబంధించి ఎంత దాచేద్దాం అని సుకుమార్ టీమ్ భావిస్తున్నప్పటికీ ఎలాగోలా లీకులు జరుగుతూనే ఉన్నాయి. రేపో మాపో ఈ సినిమాలో అనసూయ క్యారెక్టర్ ఫొటోలు కూడా బయటకు వచ్చేసిన ఆశ్చర్యపోనక్కరలేదు. ఇంతకూ చరణ్‎కు అత్తగా అనసూయ ఎలా కనిపించనుందో తెలియాలంటే మార్చి-30 వరకూ ఆగాల్సిందే..!

Comments

comments

Recent Posts