movies

రామ్ చరణ్ తరువాత చిత్రం దర్శకుడుగా బోయపాటి శ్రీను.?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలం-1985లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాక ముందే కొరటాల శివకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే కానీ ఈ చిత్రం మొదలు అవ్వాలి అంటే కొరటాల ‘భారత్ అనే నేను’ సినిమా పూర్తి చేసి రామ్ చరణ్ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోటానికి కనీసం 3-4 నెలలు పడుతుంది అలాగే రంగస్థలం షూటింగ్ నవంబర్ లో పూర్తిపోతుంది కాబట్టి రామ్ చరణ్ తను కొరటాల శివతో చేసే ముందు ఇంకో చిత్రంలో నటిస్తారు అని అందరు ఊహించారు. ఇప్పుడు అదే నిజం అయ్యేలా ఉంది.

తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీనుతో నటిస్తారని కాగా ఈ చిత్రాన్ని డివీవీ దానయ్య నిర్మిస్తారని తలేసింది. చరణ్ లాంటి మాస్ హీరోకి ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తోడు ఐతే బాక్సాఫీస్ బద్ధలు అయిపోవటం ఖాయం. సర్రైనోడు తీసిన తరువాత బోయపాటి శ్రీను మెగా ఫ్యామిలీకి బాగా చేరువ అయ్యాడు. సర్రైనోడు చూసి మెగాస్టార్ చిరంజీవి బోయపాటికి ఒక మంచి స్టొరీతో రమ్మని ఆఫర్ ఇచ్చారు ఆ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందనుంది. సై రా నరసింహ రెడ్డి పూర్తి అయిన తరువాత మొదలవుతుంది. ఇంతలో బోయపాటి రామ్ చరణ్ తో జతకట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి.

అన్ని అనుకున్నట్టుగానే జరిగితే ఈ చిత్రం ముహూర్తం డిసెంబర్ లో జరుపుకొని సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మూడవ వారం నుంచి మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. అలాగే ఈ చిత్రాన్ని 2018 విజయదశమికి విడుదల చేయాలనుకుంటున్నారు.

Comments

comments