movies

మళ్ళీ అతనితో సినిమా చేయబోతున్న చెర్రీ…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం హిట్ తో మంచి జోరు మీద ఉన్నాడు వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నా చెర్రీ. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి #RRR చిత్రంలో నటించనున్నారు. అక్టోబర్ నుంచి ఈ చిత్రం కోసం చెర్రీ తన డేట్లు ను కేటాయించనున్నాడు. ఐతే చెర్రీ ఆ తర్వాత చేయబోయే సినిమా గురించి ఒక విషయం తెలిసింది.

సినీవర్గాల సమాచారం ప్రకారం చెర్రీ గతంలో తన ‘ఎవడు’ సినిమాను తీసిన దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ చిత్రం చేయబోతున్నారని సమాచారం. #RRR చిత్రం పూర్తయిన తరువాత వచ్చే ఏడాది ఈ చిత్రం మొదలవ్వవొచ్చని అంచనా. వంశీ పైడిపల్లి ప్రస్తుతం మహేష్ తో మహర్షి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

comments