news

దోమకొండ “గడీ” కోసం రామ్‌చరణ్‌ మామ ఫైటింగ్..!!

మెగాస్టార్ చిరంజీవి వియ్యంకుడు, రామ్ చరణ్ మామ అనిల్ కామినేని… పూర్వీకుల ఆస్తి కోసం… ఫైటింగ్ ప్రారంభించారు. ఆస్తిపాస్తుల వివాదాలు కామన్ కావొచ్చు కానీ.. ఇక్కడ అనిల్ కామినేని పోరాడుతున్నది… “గడీ” కోసం..!. దోమకొండ గడీ కేంద్రంగా సంస్థానాన్ని కొన్ని దశాబ్దాల పాటు కామినేని వంశీకులు పరిపాలించారు. గడీలపై ప్రజల తిరుగుబాటు, నైజాం పతనం రెండూ ఒకే సారి జరగడంతో… దొరలంతా.. ఎక్కడికక్కడ గడీలు వదలేసి.. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లారు. కామినేని కుటుంబం అలా వెళ్లిపోయింది. ఎవరికి వారు వ్యాపారాలలో స్థిరపడిపోయారు. గడీలను పట్టించుకున్నవారు పట్టించుకున్నారు.. వదిలేసిన వారూ ఉన్నారు.

అయితే రామ్‌చరణ్ , ఉపాసన కామినేని పెళ్లి సందర్బంగా… దొమకొండ గడీలో అనిల్ కామినేని దంపతులు కొన్ని సంప్రదాయక కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి వరకూ గడీని ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడే కాస్త ఆ కోటను శుభ్రం చేయించారు. కోటపై రామ్‌చరణ్, ఉపాసన…. ముచ్చట పడటంతో…. దానిని అనిల్ కామినేని పూర్తిగా స్వాధీనం చేసుకుని.. సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పూర్తిగా అనిల్ కామినేని అధీనంలోకి గడీ వెళ్లడంతో.. ఇతర కామినేని వారసులు రంగంలోకి దిగారు. గడీకోటలోని భవనాలు తమవంటూ మూడు కుటుంబాలకు చెందిన వారు ఎవరి తాళాలు వారు వేసుకున్నారు. మరో వారసుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము వేసిన తాళాలను తొలగించారంటూ ఓ కుటుబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

రామ్ చరణ్ పెళ్లి సమయంలో కోటలో కొన్ని భవనాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. గతంలో ఎందుకూ పనికి రావనుకున్న ఆస్తులు ఇప్పుడు అత్యంత విలువైనవిగా మారడంతో.. ఆస్తులు తమ వంటే తమవని.. కామినేని సంస్థానం వారసులు రంగంలోకి దిగారు. పోలీసులకు, కలెక్టర్లకు వరుసగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పుడు నాలుగు కుటుంబాల కామినేని వారసులు.. గడీలోని కోటలు తమవంటే తమవని బోర్డులు ఏర్పాటు చేశారు. 2013 నుంచి కోటను అధీనంలో ఉంచుకున్న అనిల్ కామినేని తమ కోటలోకి అక్రమంగా చొరబడి భవనాలకు తాళాలు వేశారని ఇతరులపై ఫిర్యాదుచేశారు. ఇలా పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

దోమకొండ గడీకి అప్పట్లో తెలంగాణలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అద్దాలమేడ, అస్గర్‌మంజిల్, ఉమా మంజిల్‌ లాంటి భవనాలు గడీలో ఉన్నాయి. ఈ భవనాలను చూసే రామ్‌చరణ్, ఉపాసన ముచ్చటపడ్డారని.. వాటిని తమ హాలీడే విడిదిగా వాడుకోవాలని గతంలో నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఉపాసన, రామ్‌చరణ్ కూడా కొన్ని ఇంటర్యూల్లో దోమకొండ గడీపై తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు. మరి అల్లుడి కోసమైనా.. అనిల్ కామినేని.. ఈ కోటలను కాపాడుకోవడానికి చివరి వరకు పోరాడక తప్పదేమో..!

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment