news

రాంగోపాల్ వర్మను భార్య రేవతి ఎందుకు వదిలేసిందో తెలుసా?!!

దేవుడూ, సెక్సూ, నిజమూ కలగలిసిన మియా మాల్కోవా అంటూ రాంగోపాల్‌ వర్మ ఓ వీడియో తీసుకున్న సంగతి తెలిసిందే. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు…ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మొత్తం ఫైనల్ వీడియో ఈ జనవరి 26 ఉదయం 9 గంటలకి విడుదలవుతోందని సంచలనం రేపాడు వర్మ. ఇప్పటికే సమాజంలో విశృంఖలత్వం, విచ్చలవిడితనం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాలు ఈ ఘటనతో ఒక్కసారిగా వర్మపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు లెఫ్ట్, ఇటు రైట్ అంటే బీజేపీ మహిళా సంఘాలు వర్మపై తీవ్రమైన దాడి చేస్తున్నాయి.

తాను తీసిన వీడియోలో సెక్సూ, దేవుడూ అనడంతో బీజేపీ మహిళా సంఘాలకు పట్టరాని కోపం వచ్చేసింది. బీజేపీ మహిళా మోర్చ నేతలు విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. జీఎస్‌టీ వెబ్‌ సిరీస్‌ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నాడంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చ నేతలు మాట్లాడుతూ.. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి అర్థంపర్థం లేని పనులు చేస్తున్నాడని… అందుకే ఆయనను భార్యతో పాటు కూతురు కూడా వెలి వేశారని వ్యాఖ్యలు చేసి సంచలనాత్మక విషయాన్ని చర్చకు పెట్టారు. రాంగోపాల్ వర్మను భార్య వదిలేసిందా?

అసలు చాలా మంది రాంగోపాల్ వర్మకు పెళ్లి కాలేదని అనుకుంటారు. కాని అది నిజం కాదు. ఆయన భార్య పేరు రత్న… అన్నట్టు వారివురి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా రేవతి అనే కూతురు కూడా ఉంది. అయితే వర్మ పేరు విన్నవారెవరూ ఆయనది అన్యోన్య దాంపత్యం అంటే అంగీకరింలేరులే… కాని పాపం రత్న మాత్రం చాలా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. వర్మకు పూర్తి విరుద్ధమైన మనస్తత్వం. ఇటీవల ఓ సందర్భంలో వర్మ మాట్లాడుతూ తనకు మంచి భార్య దొరికింది కాని… తన భార్యకు మాత్రం మంచి భర్త దొరకలేదని వ్యాఖ్యానించాడు. ఈ ఒక్కమాటతోనే చెప్పొచ్చు ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో..

వర్మ బిహేవియర్ తెలిసిందేగా… అందుకే భార్య రత్న ఆయన నుంచి విడిపోయి కూతురు రేవతిని పద్ధతిగా పెంచుకున్నారు. ఆ అమ్మాయి రష్యాలో ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈ పెళ్లి వేడుకలో వర్మ ను కేవలం ఓ గెస్ట్ గా మాత్రమే చూశారు ఆ తల్లీ బిడ్డలు. ఇక అన్నట్టు వర్మ కూతురు రేవతికి వర్మకు ఎప్పుడూ ఉప్పూ నిప్పే.. ఎన్నో అంశాల్లో వేలుపెడుతూ వివాదాలు కొనితెచ్చుకుంటున్న వర్మపై ట్విట్టర్ వేధికగా విరుచుకుపడ్డారు రేవతి. ముఖ్యంగా తాను ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ ను వర్మ పదే పదే విమర్శిస్తే తట్టుకోలేకపోయింది రేవతి. ఇక వివాదమే జీవితం.. తన అభిప్రాయమే అంతిమం అన్నట్టుగా ఉండే వర్మ స్టయిల్ కు కుటుంబ జీవితం లేదనే చెప్పాలి. అది తనకు పడదని కూడా వర్మ పలుమార్లు చెప్పుకున్నాడు. అన్నట్టు వర్మ మాజీ భార్య రత్నకు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బంధువు కూడా అవుతారు.

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment